
South Korea: దక్షిణకొరియా అధ్యక్షుడికి గట్టి ఎదురుదెబ్బ.. పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానానికి ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ అసెంబ్లీ ఆయనపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి తాజా ఓటింగ్‌లో మద్దతు లభించింది.
204-85 ఓట్ల భారీ తేడాతో ఈ తీర్మానం ఆమోదం పొందింది. అసెంబ్లీలో అధిక సంఖ్యలో ప్రతిపక్ష సభ్యులు ఈ తీర్మానానికి మద్దతు ఇవ్వడం విశేషం.
ఈ నిర్ణయంతో యూన్ సుక్ యోల్ అధికారాలలో కోత పడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, తదుపరి చర్యల్లో భాగంగా, అధికార పార్టీలో చీలికలు మరింత ముదిరే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
Details
అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్
ఇదే సమయంలో అధ్యక్షుడి కార్యాలయం మాత్రం ఈ పరిణామాలపై సీరియస్‌గా స్పందించింది.
అభిశంసన తీర్మానానికి రాజకీయ ఉద్దేశాలే ప్రాముఖ్యం. దేశానికి నష్టమేకానీ ప్రయోజనం లేదంటూ అధికార పార్టీ ఆరోపణలు చేసింది.
ఈ పరిస్థితుల్లో దక్షిణ కొరియా రాజకీయ వాతావరణం మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
తక్షణమే అధ్యక్షుడు తన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తుండగా, యూన్ సుక్ యోల్ మద్దతుదారులు మాత్రం దీన్ని రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు.