Ayatollah Ali Khamenei: సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయారు.. స్పష్టం చేసిన ఇరాన్ మీడియా
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన శనివారం (ఫిబ్రవరి 28) దాడుల్లో ఖమేనీని లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడైంది. ఈ దాడులు ఖమేనీ నివాసాన్ని లక్ష్యంగా మిస్సైళ్లతో, దాదాపు 30 బాంబులతో విరుచుకుపడినట్లు సమాచారం. అయితే ఇరాన్ ప్రభుత్వం తెలిపినట్లుగా, దాడికి ముందే ఖమేనీని సురక్షిత ప్రదేశానికి తరలించామని, కాబట్టి ఆయన సేఫ్ గా ఉన్నారని గుర్తించారు. అయితే ఆదివారం (మార్చి 1) తెల్లవారుజామున, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ సైనిక దాడుల్లో ఖమేనీ మరణించారని తెలిపారు.
Details
ఖమేని చనిపోయారు : డొనాల్డ్ ట్రంప్
చరిత్రలో అత్యంత దుర్మార్గులలో ఒకరైన ఖమేనీ చనిపోయాడు. మా ఇంటెలిజెన్స్, అత్యంత ఆధునిక ట్రాకింగ్ వ్యవస్థలను అతను తప్పించుకోలేకపోయాడు. ఈ చావుతో ఇరాన్, అమెరికా, బాధిత దేశాలకు న్యాయం జరిగింది. ఖమేనీతో పాటు ఇతర ఇరాన్ అగ్ర నాయకులు కూడా హతమయ్యారు. ఇరాన్ ప్రజలకు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశమని చెప్పారు. ఇజ్రాయెల్ కూడా ఖమేనీ మరణాన్ని ధృవీకరించింది. ట్రంప్, ఇజ్రాయెల్ ప్రకటనల అనంతరం, ఇరాన్ మీడియా ప్రధాన వ్యవస్థలు—తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ, ఫార్ట్స్ న్యూస్ ఏజెన్సీ—ఖమేనీ మరణ వార్తను అధికారికంగా గుర్తించి ప్రచురించాయి. ఖమేనీ కుటుంబ సభ్యులలో కూతరు, అల్లుడు, కోడలు, మనుమడు కూడా ఈ దాడుల్లో చనిపోయినట్లు సమాచారం.