LOADING...
US: అమెరికాలో శాస్త్రవేత్తల అనుమానాస్పద మరణాలు.. అసలు ఏమి జరుగుతోంది?
అమెరికాలో శాస్త్రవేత్తల అనుమానాస్పద మరణాలు.. అసలు ఏమి జరుగుతోంది?

US: అమెరికాలో శాస్త్రవేత్తల అనుమానాస్పద మరణాలు.. అసలు ఏమి జరుగుతోంది?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 18, 2026
12:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

అగ్రరాజ్యం యూఎస్‌లో ప్రస్తుతం ఒక విచిత్రమైన భయం నెలకొంది. 2023 నుంచి ఇప్పటివరకు దాదాపు 10 మంది ఉన్నత స్థాయి శాస్త్రవేత్తలు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం లేదా అదృశ్యమవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, "ఇది యాదృచ్ఛికమా? లేక దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా?" అనే విషయాన్ని త్వరలోనే వెలుగులోకి తీసుకొస్తామని తెలిపారు. ఈ ఘటనలపై నివేదికలను పరిశీలిస్తున్నామని, త్వరలోనే స్పష్టత ఇస్తామని వైట్‌హౌస్‌ ప్రకటించింది.2

వివరాలు

ఎవరా శాస్త్రవేత్తలు?

అదృశ్యమైన లేదా మరణించిన వారిలో ఎక్కువ మంది అణుశక్తి, అలాగే 'గుర్తించని వైమానిక దృగ్విషయాలు' (UAP/UFO)పై పరిశోధనలు చేస్తున్నవారే కావడం గమనార్హం. ముఖ్యంగా న్యూ మెక్సికో నుంచి నలుగురు ఉండటం అనుమానాలకు తావిస్తోంది. 1. నాసా శాస్త్రవేత్తల మిస్టరీ మోనికా రెజా అనే జెట్‌ ప్రొపల్షన్‌ లాబొరేటరీ (JPL) డైరెక్టర్‌ గత ఏడాది జూన్‌లో హైకింగ్‌కు వెళ్లి అదృశ్యమయ్యారు. తన స్నేహితుడి కంటే కేవలం 30 అడుగుల దూరంలో నడుస్తూ ఉండగా ఒక్కసారిగా కనిపించకుండా పోవడం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.

వివరాలు

2. మాయమైన స్పేస్‌ మాస్టర్

ఈ జాబితాలో అత్యంత ప్రాధాన్యమైన వ్యక్తి మేజర్‌ జనరల్‌ విలియం నీల్ మెక్‌కాస్లాండ్. పెంటగాన్‌లో అంతరిక్ష పరిశోధనల్లో కీలక పాత్ర పోషించిన ఆయన ఈ ఏడాది ఫిబ్రవరిలో అదృశ్యమయ్యారు. అదృశ్యానికి ముందు తన ఫోన్‌, కళ్లజోడు, వాచీ అన్నీ ఇంట్లోనే వదిలి, కేవలం తుపాకీ, హైకింగ్‌ బూట్లు, వాలెట్‌తో వెళ్లినట్లు సమాచారం. 1947లో జరిగిన రోస్‌వెల్ UFO సంఘటన రహస్యాలపై ఆయనకు అవగాహన ఉందని ప్రచారం ఉంది. 2016లో వికీలీక్స్ ద్వారా వెలుగులోకి వచ్చిన హ్యాకింగ్‌ వ్యవహారంలో ఆయన పేరు ప్రస్తావనకు రావడం కూడా ఆసక్తికరంగా మారింది. అయితే రోస్వెల్‌ ఘటనతో తన భర్తకు సంబంధం లేదని ఆయన భార్య సుసెన్‌ విల్కర్‌సన్‌ స్పష్టం చేశారు.

Advertisement

వివరాలు

3. తుపాకీ గుళ్లకు బలి

నూనో లౌరీరో అనే ఎంఐటీ ప్రొఫెసర్‌, ఫ్యూజన్‌ ఎనర్జీ పరిశోధకుడు డిసెంబరులో తన నివాసంలోనే కాల్చి చంపబడ్డారు. అలాగే కార్ల్ గ్రిల్మైర్ అనే ఖగోళ శాస్త్రవేత్తను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన ఇంటి ముందే కాల్చి హత్య చేశారు. ఇది కుట్రనా? ఈ వరుస ఘటనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా వద్ద ఉన్న అణు, గ్రహాంతరవాసుల రహస్యాలు బయటకు రాకుండా ఎవరో కావాలనే ఈ శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకుంటున్నారనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే Avi Loeb వంటి నిపుణులు ఈ వాదనలను ఖండిస్తున్నారు.

Advertisement

వివరాలు

కారణాలను వెల్లడించలేదు

ఇవి విడివిడిగా జరిగిన సంఘటనలేనని, శాస్త్రవేత్తలపై ఉన్న తీవ్ర పని ఒత్తిడి, వ్యక్తిగత కారణాలు కూడా ఇందుకు కారణమై ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇక నాసాలో పనిచేసిన ఇద్దరు శాస్త్రవేత్తల మరణాలు కూడా అనుమానాస్పదంగా ఉండగా, వాటి వెనుక గల అసలు కారణాలను ప్రభుత్వం ఇప్పటికీ బహిరంగపరచలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికాలో భయం, అనుమానాలు మరింత పెరుగుతున్నాయి.

Advertisement