NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Sydney : సిడ్నీలో దారుణం...షాపింగ్ మాల్ లో కత్తితో దాడి చేసిన వ్యక్తి...ఆరుగురు మృతి
    తదుపరి వార్తా కథనం
    Sydney : సిడ్నీలో దారుణం...షాపింగ్ మాల్ లో కత్తితో దాడి చేసిన వ్యక్తి...ఆరుగురు మృతి
    జెర్సీ దుస్తుల్లో షాపింగ్​ మాల్​లోకి ప్రవేశించిన దుండగుడు...కాల్చిచంపిన మహిళా పోలీసు

    Sydney : సిడ్నీలో దారుణం...షాపింగ్ మాల్ లో కత్తితో దాడి చేసిన వ్యక్తి...ఆరుగురు మృతి

    వ్రాసిన వారు Stalin
    Apr 13, 2024
    04:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో దారుణం చోటుచేసుకుంది.

    ఓ వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి ఆరుగురిని పొట్టనబెట్టుకున్నాడు.

    శనివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.

    సిడ్నీలోని ఓ షాపింగ్ సెంటర్ లో కత్తితో చొరబడిన ఓ దుండగుడు కనిపించిన వారిని కనిపించినట్లుగా విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచాడు.

    ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

    కత్తితో దాడికి పాల్పడిన వ్యక్తి ని మహిళా పోలీసు అధికారి కాల్చి చంపారు.

    సిడ్నీలో ని వెస్ట్‌ఫీల్డ్ బోండి జంక్షన్ మాల్ కాంప్లెక్స్‌లో శనివారం మధ్యాహ్నం దుకాణదారులతో కిక్కిరిసి ఉండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

    ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడ చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

    Stabbed in Sydney mall

    క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన పోలీసులు

    కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మరణించినట్లు న్యూ సౌత్ వేల్స్ పోలీస్ అధికారి కుక్ మీడియాకు వెల్లడించారు.

    అయితే ఈ దాడి వెనుక కుట్ర దాగి ఉందేమోన నే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    అయితే ఈ ఘటనపై ఉగ్రవాదుల ప్రమేయాన్ని కూడా తోసిపుచ్చలేమని ఆ అధికారి తెలిపారు.

    ఈ దాడిలో గాయపడిన ఎనిమిది మందిని వేర్వేరు ఆస్పత్రులకు తరలించామని, ఇందులో చిన్నారులు కూడా ఉన్నారని ఆయన చెప్పారు.

    సెక్యూరిటీ కెమెరా ఫుటేజీలో ఆస్ట్రేలియన్ రగ్బీ లీగ్ జెర్సీ ధరించిన ఓ వ్యక్తి పెద్ద కత్తితో షాపింగ్ సెంటర్ చుట్టూ పరుగెత్తడం, గాయపడిన వ్యక్తులు నేలపై విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానిక మీడియా ప్రసారం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆస్ట్రేలియా
    పోలీస్

    తాజా

    Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో ఐపీఓల సందడి.. 5 కొత్త సబ్‌స్క్రిప్షన్లు, 3 కొత్త లిస్టింగ్‌లు  ఐపీఓ
    Revanth Reddy: డ్రగ్స్‌ నిర్మూలనలో తెలంగాణ ఆదర్శం : సీఎం రేవంత్ రెడ్డి  రేవంత్ రెడ్డి
    ISIS: ముంబయి ఎయిర్‌పోర్టులో ఇద్దరు ఐసిస్ అనుమానితుల అరెస్టు జమ్ముకశ్మీర్
    shreyas iyer: పంజాబ్ జట్టును శ్రేయస్ అయ్యర్ నడిపించిన తీరు అద్భుతం : సురేష్ రైనా శ్రేయస్ అయ్యర్

    ఆస్ట్రేలియా

    World Cup final: టీమిండియా, ఆస్ట్రేలియా జట్లలో కీలక ఆటగాళ్ల గణాంకాలు ఇవే.. ప్రపంచ కప్
    టీమిండియా ప్రపంచ కప్ గెలిస్తే రూ.100కోట్లు పంచుతా: ప్రముఖ కంపెనీ సీఈఓ  ప్రపంచ కప్
    World Cup final preview: టీమిండియా ముచ్చటగా మూడోసారి వరల్డ్ ఛాంపియన్‌గా నిలుస్తుందా?  ప్రపంచ కప్
    World Cup final: నేడే టీమిండియా vs ఆస్ట్రేలియా ఫైనల్.. పిచ్ ఎవరికి అనుకూలం?  ప్రపంచ కప్

    పోలీస్

    కుమారుడి కోసం బానెట్‌పైకి దూకిన తల్లి.. ముగ్గురు పోలీసులు సస్పెండ్  మధ్యప్రదేశ్
    Hyderabad: అంబులెన్స్ సైరన్‌ల దుర్వినియోగంపై తెలంగాణ డీజీపీ సీరియస్  తెలంగాణ
    ఢిల్లీలో ఫ్యాషన్ డిజైనర్ మృతి.. హత్య.. ఆత్మహత్యా..! దిల్లీ
    Uttar pradesh: చెల్లిని నరికి చంపి, తలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన యువకుడు  ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025