LOADING...
Tarique Rahman: బంగ్లాదేశ్‌ ప్రధానిగా తారిఖ్ రెహమాన్ ప్రమాణస్వీకారం
బంగ్లాదేశ్‌ ప్రధానిగా తారిఖ్ రెహమాన్ ప్రమాణస్వీకారం

Tarique Rahman: బంగ్లాదేశ్‌ ప్రధానిగా తారిఖ్ రెహమాన్ ప్రమాణస్వీకారం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 17, 2026
04:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌కు నూతన ప్రధానిగా తారిఖ్‌ రెహ్మాన్‌ మంగళవారం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశాధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ ఆయనతో పాటు కొత్తగా నియమితులైన పలువురు క్యాబినెట్ మంత్రులతో ప్రమాణం చేయించారు. ఈ వేడుక రాజధాని ఢాకాలో ఘనంగా జరిగింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆహ్వానించడంతో భారత లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

వివరాలు 

35 ఏళ్ల తర్వాత తొలి పురుష ప్రధాని..

గత మూడు దశాబ్దాలకు పైగా బంగ్లాదేశ్‌లో మహిళలే ప్రధానిగా కొనసాగారు. ఈ సమయంలో అవామీ లీగ్ నేత షేక్ హసీనా,బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) నాయకురాలు ఖాలిదా జియా దేశ పాలనను చేపట్టారు. తాజాగా బీఎన్‌పీ ఛైర్మన్‌గా ఉన్న తారిఖ్ రెహమాన్ 35 ఏళ్ల అనంతరం ఆ పదవిని అధిరోహించిన తొలి పురుష ప్రధానిగా చరిత్ర సృష్టించారు. ఖాలిదా జియా కుమారుడైన తారిఖ్ రెహమాన్ 2008లో దేశాన్ని విడిచి వెళ్లి, సుమారు 17 సంవత్సరాలు బ్రిటన్‌లో ప్రవాస జీవితం గడిపారు.

వివరాలు 

బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య పద్ధతిలో కొత్త ప్రభుత్వం

గత ఏడాది డిసెంబరులోనే ఆయన స్వదేశానికి తిరిగి వచ్చారు. తల్లి మరణానంతరం పార్టీ బాధ్యతలను స్వీకరించిన ఆయన, బీఎన్‌పీని విజయ మార్గంలో ముందుకు నడిపించారు. ఇటీవలి ఎన్నికల్లో తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ విజయం సాధించిన తారిఖ్ రెహమాన్ నేతృత్వంలో, మొత్తం 299 పార్లమెంట్ స్థానాల్లో 209 స్థానాలను బీఎన్‌పీ కైవసం చేసుకుంది. 2024లో షేక్ హసీనా ప్రధానమంత్రి పదవిని కోల్పోయిన తర్వాత, ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య పద్ధతిలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది.

Advertisement