Loading...
Team India 400 Sixes: టీమిండియా @ 400.. ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త రికార్డ్‌.. అదేంటంటే?
టీమిండియా @ 400.. ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త రికార్డ్‌.. అదేంటంటే?

Team India 400 Sixes: టీమిండియా @ 400.. ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త రికార్డ్‌.. అదేంటంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 13, 2026
11:30 am

ఈ వార్తాకథనం ఏంటి

2026లో భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ శైలి పూర్తిగా మారిపోయిందని చెప్పొచ్చు. ప్రత్యర్థి ఎవరైనా, మైదానం ఏదైనా సిక్సర్లతో విరుచుకుపడటమే లక్ష్యంగా టీమిండియా బ్యాటర్లు బరిలోకి దిగారు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే ఏ జట్టూ సాధించని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 400 సిక్సర్లు బాదిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 2026 నవంబర్ 1న న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఈ మైలురాయిని అందుకున్నారు.

వివరాలు

400వ సిక్సర్ బాదింది ఎవరంటే?

హామిల్టన్‌లోని సెడ్డాన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో భారత్ ఈ చారిత్రాత్మక ఘనత సాధించింది.

ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు మొత్తం 11 సిక్సర్లు బాదడంతో.. 2026లో టీమిండియా సిక్సర్ల సంఖ్య 400కు చేరింది.

ఆల్‌రౌండర్ నామన్ ధీర్ ఈ రికార్డులో కీలక పాత్ర పోషించాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో బ్లెయిర్ టిక్నర్ బౌలింగ్‌లో ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్ బాది జట్టుకు ఈ అరుదైన మైలురాయిని అందించాడు.

అప్పటివరకు ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా ఆస్ట్రియా పేరిట రికార్డు ఉండేది. 2025లో ఆ జట్టు 326 సిక్సర్లు కొట్టింది.

ఇప్పుడు ఆ రికార్డును భారత్ అధిగమించి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది.

వివరాలు

అభిషేక్ శర్మ టాప్.. ఇషాన్, సంజూ కూడా

2026లో భారత జట్టు సిక్సర్ల వేటలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఏడాది అతడి ఖాతాలో ఏకంగా 86 సిక్సర్లు చేరాయి.

వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 60 సిక్సర్లతో రెండో స్థానంలో ఉండగా.. సంజూ శాంసన్ 50 సిక్సర్లతో తర్వాతి స్థానంలో నిలిచాడు.

ఈ గణాంకాలు భారత బ్యాటర్లు ఎంతటి దూకుడుతో ఆడుతున్నారో స్పష్టం చేస్తున్నాయి.

ADVERTISEMENT

వివరాలు

న్యూజిలాండ్‌పై మరో రికార్డు

ఈ ఏడాది భారత్ బాదిన 400 సిక్సర్లలో ఏకంగా 142న్యూజిలాండ్‌పై రావడం మరో ఆసక్తికరమైన విషయం.

ఒకే ప్రత్యర్థిపై ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగానూ భారత్ ప్రత్యేక గుర్తింపు పొందింది.

గతంలో 2022లో 40 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 289 సిక్సర్లు మాత్రమే బాదింది. కానీ 2026లో 40వ మ్యాచ్‌కే 400 సిక్సర్ల మార్కును అందుకోవడం విశేషం.

మొత్తంగా టీ20 క్రికెట్‌లో దూకుడు బ్యాటింగ్‌కు కొత్త నిర్వచనం చెబుతున్న భారత జట్టు.. 2026ను సిక్సర్ల సంవత్సరంగా మార్చేసింది.

అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ వంటి ఆటగాళ్ల విధ్వంసం ఈ ప్రపంచ రికార్డులో కీలక పాత్ర పోషించింది. ఏడాది ముగిసేలోపు ఈ సంఖ్య మరింత పెరుగుతుందేమో చూడాలి.

ADVERTISEMENT