Turkey: టర్కియేలోని స్కీ రిసార్ట్‌లో హోటల్ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి 32 మందికి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
టర్కీలోని స్కీయింగ్ రిసార్టు హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 32 మంది గాయపడినట్లు సమాచారం.
12 అంతస్తులున్న ఈ హోటల్‌లో తెల్లవారుజామున 3:30 గంటలకు మంటలు చెలరేగాయి.
ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. హోటల్‌లో మంటల నుంచి తప్పించుకునే క్రమంలో దూకిన ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు.
వివరాలు
హోటల్‌లో గెస్టుల దుస్థితి
ప్రాణాలు నిలుపుకోవడానికి హోటల్ కస్టమర్లు బెడ్ షీట్లు, బ్లాంకెట్ల సాయంతో రూముల నుంచి కిందికి దిగే ప్రయత్నం చేశారు.
ప్రమాదం జరిగే సమయంలో హోటల్‌లో మొత్తం 234 మంది గెస్టులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
నిద్రలో ఉండగానే మంటలు చెలరేగడంతో, బయటకు పరుగులు తీశామని ఓ స్కీయింగ్ ఇన్‌స్ట్రక్టర్ తెలిపారు.
మంటల తీవ్రత
హోటల్ గదుల్లో పొగ కమ్ముకోవడంతో గెస్టులు ఫైర్ ఎస్కేప్‌ను గుర్తించేందుకు ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది.
మంటల్లో హోటల్ రూఫ్‌తో పాటు టాప్ ఫ్లోర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
మొత్తం 161 గదులున్న ఈ హోటల్ ఇస్తాంబుల్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొరొగ్లు పర్వతాల్లోని ప్రసిద్ధ స్కీయింగ్ రిసార్ట్.
వివరాలు
రిసార్టులన్నీ పూర్తిగా గెస్టులతో..
స్కూళ్లకు సెమిస్టర్ సెలవులు ఇచ్చిన నేపథ్యంలో రిసార్టులు పూర్తిగా గెస్టులతో నిండిపోయాయి.
ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి 30 ఫైర్ ట్రక్కులు, 28 అంబులెన్సులను పంపి రక్షణ చర్యలు చేపట్టారు.
మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతుండగా, గాయపడినవారికి సమీప ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.