
Houthis: ఇజ్రాయెల్-హూతీల మధ్య ఉద్రిక్తతలు.. విమానాశ్రయంపై దాడికి ప్రయత్నం
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఉద్రిక్తతల కారణంగా పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారింది. ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
గాజాలో ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా హూతీలు యెమెన్ నుంచి క్షిపణిని ప్రయోగించడం గమనార్హం. ఈ దాడి ఇజ్రాయెల్ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు భావిస్తున్నారు.
అయితే ఆ క్షిపణిని నేలకూల్చామని ఇజ్రాయెల్ సేనలు ప్రకటించాయి.
ఈదాడుల బాధ్యతను హూతీ తిరుగుబాటుదారుల సైనిక ప్రతినిధి యాహ్యా సారీ స్వీకరించారు.
గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆగే వరకు తమ ప్రతిఘటన కొనసాగుతుందని, 48 గంటల్లో మూడోసారి దాడులు చేపట్టామని తెలిపారు.
అంతేకాకుండా ఎర్ర సముద్రంలోని అమెరికా(USA)విమాన వాహక నౌక 'యూఎస్‌ఎస్ హ్యారీ ఎస్. ట్రూమాన్'పై హూతీలు దాడులు ప్రారంభించారని పేర్కొన్నారు.
Details
పెద్ద ఎత్తున్న దాడులు చేస్తున్న అమెరికా
టెల్ అవీవ్‌కు సమీపంలోని బెన్ గురియన్ విమానాశ్రయం నుంచి ప్రయాణించొద్దని ప్రజలను హెచ్చరించారు.
అయితే బెన్ గురియన్ విమానాశ్రయ వెబ్‌సైట్ సాధారణంగా పనిచేస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఇజ్రాయెల్ నౌకలపై దాడులను పునరుద్ధరిస్తామని ప్రకటించిన హూతీలపై ఇటీవల అమెరికా పెద్దఎత్తున దాడులు చేసింది.
'ఉగ్ర స్థావరాలు, ఉగ్ర నేతలపై గగనతల దాడులు జరుగుతున్నాయి. మన నౌకా స్థావరాలు, వాయు స్థావరాలు, నౌకాదళాలను రక్షించుకోవడంలో మన సైనికులు పాటుపడుతున్నారు.
స్వేచ్ఛాయుత సముద్ర వాణిజ్యాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నారని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు.
Details
హూతీలకు మద్దతు ఇవ్వడం ఆపాలి
ప్రపంచ వ్యాప్తంగా జలమార్గాల్లో అమెరికా నౌకాదళాలను అడ్డుకునేందుకు ఏ ఉగ్రవాద శక్తి సాహసించలేదని ఆయన స్పష్టం చేశారు. హూతీలకు మద్దతు ఇవ్వడం ఆపాలని అమెరికా ఇరాన్‌ను ఇప్పటికే హెచ్చరించింది.
దీనిపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ స్పందిస్తూ, హూతీల దాడుల్లో తమ ప్రమేయం లేదని తెలిపారు.
వారు తమ స్వంత కారణాల వల్ల దాడులు చేస్తున్నారని, అమెరికా ఈ విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
మరోవైపు, అమెరికా దాడులను హూతీ పొలిటికల్ బ్యూరో యుద్ధ నేరంగా అభివర్ణించింది. యెమెన్ దళాలు ప్రతిస్పందనకు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించింది.