LOADING...
Reza Pahlavi: బెర్లిన్‌లో ఉద్రిక్తత.. ఇరాన్‌ బహిష్కృత యువరాజు పహ్లవీపై దాడి
బెర్లిన్‌లో ఉద్రిక్తత.. ఇరాన్‌ బహిష్కృత యువరాజు పహ్లవీపై దాడి

Reza Pahlavi: బెర్లిన్‌లో ఉద్రిక్తత.. ఇరాన్‌ బహిష్కృత యువరాజు పహ్లవీపై దాడి

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 24, 2026
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌ బహిష్కృత యువరాజు రెజా పహ్లావిపై జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ఎరుపు రంగు ద్రావణం చల్లిన ఘటన కలకలం రేపింది. దాదాపు ఐదు దశాబ్దాలుగా స్వదేశానికి దూరంగా జీవిస్తున్న పహ్లవీ, బెర్లిన్‌లోని ఫెడరల్ ప్రెస్ కాన్ఫరెన్స్ భవనంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా-ఇరాన్‌ కాల్పుల విరమణ ఒప్పందంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. టెహ్రాన్‌ ప్రభుత్వ వైఖరిలో మార్పు వస్తుందన్న భ్రమతో ఈ ఒప్పందాన్ని పొడిగించినట్లు కనిపిస్తోందని, కానీ అది సాధ్యంకాదని వ్యాఖ్యానించారు. అనంతరం సమావేశం ముగిసిన తర్వాత భవనం వెలుపలకు వచ్చిన పహ్లవీపై ఓ వ్యక్తి ఎరుపు రంగు ద్రావణాన్ని చల్లాడు. ఆ ద్రావణం ఆయన కోటు, మెడపై పడింది.

వివరాలు

అనుమానితుడు అరెస్టు

ఈ ఘటనలో పహ్లవీకి ఎలాంటి గాయాలు కాలేదు. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అది టమాటా రసం అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. 65 ఏళ్ల పహ్లవీ, ఇరాన్‌ మాజీ షా మహమ్మద్ రెజా పహ్లావి కుమారుడు. 1979లో జరిగిన ఇరానియన్ విప్లవం అనంతరం ఆయన తండ్రి పదవి కోల్పోయారు. పహ్లవీ కూడా దేశ బహిష్కరణకు గురయ్యారు. అప్పటి నుంచి విదేశాల్లోనే ఉంటూ, ఇరాన్‌లో తిరిగి అధికారాన్ని సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఆ దేశంపై అమెరికా-ఇజ్రాయెల్‌ సైనిక చర్యలను కూడా ఆయన సమర్థిస్తున్నారు. పహ్లవీపై జరిగిన ఈ ఘటనను నిరసిస్తూ, ఆయన మద్దతుదారులు వందల సంఖ్యలో జర్మనీ పార్లమెంట్‌ భవనం సమీపంలో ఆందోళన చేపట్టారు.

Advertisement