Strait of Hormuz Incident: హర్మూజ్‌లో ఉద్రిక్తతలు.. మూడు ఆయిల్ ట్యాంకర్లను ఢీకొన్న మైన్లు!
ఈ వార్తాకథనం ఏంటి
హర్మూజ్ జలసంధిలో మైన్లను ఢీకొనడంతో మూడు ఆయిల్ ట్యాంకర్లలో మంటలు చెలరేగినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఇరాన్ నేవీ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) అధికారిక మీడియా ద్వారా వెల్లడించాయి.
వివరాలు
నిషేధిత మార్గంలో ప్రయాణం.. ఐఆర్‌జీసీ ఆరోపణ
శనివారం ఉదయం జలసంధి తూర్పు భాగంలో ఓ ఆయిల్ ట్యాంకర్ మైన్‌ను ఢీకొట్టినట్లు ఇరాన్ అధికారులు తెలిపారు.
ఆ తర్వాత నిషేధిత మార్గంలో ప్రయాణిస్తున్న మరో రెండు ట్యాంకర్లు కూడా మైన్లను ఢీకొన్నాయని పేర్కొన్నారు.
ఈ రెండు నౌకలు తమ రాడార్, నావిగేషన్ వ్యవస్థలను నిలిపివేసి ప్రయాణించాయని ఐఆర్‌జీసీ ఆరోపించింది.
ప్రమాదానికి గురైన నౌకల్లో ఒకటి సూపర్ ట్యాంకర్ అని ఇరాన్ వెల్లడించింది.
అయితే ఆ మూడు నౌకల పేర్లు, అవి ఏ దేశానికి చెందినవి, వాటిలోని సిబ్బంది పరిస్థితి, ప్రమాదం వల్ల జరిగిన నష్టం వంటి పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు.
వివరాలు
నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక
హర్మూజ్ జలసంధిలో తమ నిబంధనలను పాటించని నౌకలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇరాన్ ఇప్పటికే హెచ్చరిస్తోంది.
ఈ నేపథ్యంలో మూడు ఆయిల్ ట్యాంకర్లు మైన్లను ఢీకొన్న ఘటన చోటుచేసుకోవడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.