USA: ఉత్తర, దక్షిణ కరోలినాలో భయానక కార్చిచ్చు.. వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో భారీ కార్చిచ్చు విస్తరించింది.
ఇప్పటికే వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
దక్షిణ కరోలినా అటవీ సంరక్షణ విభాగం ప్రకారం, ఇప్పటివరకు 4.9 చదరపు కిలోమీటర్ల అటవీ భూమి పూర్తిగా దగ్ధమైంది.
అయితే ఇప్పటి వరకు ఎవరైనా గాయపడినట్లు లేదా ప్రాణాలు కోల్పోయినట్లు ఎలాంటి సమాచారం లేదు.
Details
161 హెక్టార్ల అటవీ భూమి దగ్ధం
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దక్షిణ కరోలినా గవర్నర్ హెన్రీ మెక్‌మాస్టర్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మొత్తం 175 ప్రదేశాల్లో కార్చిచ్చు వ్యాపించినట్లు తెలిపారు.
నార్త్ కరోలినాలో నాలుగు వేర్వేరు అటవీ ప్రాంతాల్లో మంటలు రేగగా, 161 హెక్టార్ల అటవీ భూమి దగ్ధమైంది.
ఈ ప్రాంతాల్లో ఉవారీ నేషనల్ ఫారెస్ట్‌లో చెలరేగిన మంటలు అత్యంత తీవ్రంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
జపాన్‌లో గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత పెద్ద స్థాయిలో కార్చిచ్చు వ్యాపించింది.
Details
జపాన్‌లో 30 ఏళ్లలో అతి పెద్ద కార్చిచ్చు
ఈ మంటల్లో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 4,500 ఎకరాల అటవీ సంపద నాశనమైంది.
జపాన్ ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ప్రకారం, ఈ కార్చిచ్చును బుధవారం గుర్తించారు. అప్పటికే 84 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
ఆదివారం ఉదయం 4,600 మందిని ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశించగా, 1,200 ఇళ్లలోని వారిని అత్యవసర వసతి ప్రదేశాలకు తరలించారు.
మంటలను అదుపు చేసేందుకు దాదాపు 1,700 మంది సిబ్బందిని రంగంలోకి దించారు. సహాయక చర్యల కోసం విమానాలు కూడా వినియోగిస్తున్నారు.
1992లో హోక్కైడోలో సంభవించిన కార్చిచ్చుతో పోలిస్తే ఈ దుర్ఘటన చాలా పెద్దదని అధికారులు చెబుతున్నారు. అప్పట్లో 1,000 హెక్టార్ల అటవీ భూమి దగ్ధమైతే, ఈసారి ఆ సంఖ్య దానిని మించిపోయింది.