Page Loader
Jaishankar: ఉగ్రవాదమే ఆ దేశాన్ని తినేస్తోంది.. పాకిస్థాన్‌పై మరోసారి మండిపడ్డ జైశంకర్
ఉగ్రవాదమే ఆ దేశాన్ని తినేస్తోంది.. పాకిస్థాన్‌పై మరోసారి మండిపడ్డ జైశంకర్

Jaishankar: ఉగ్రవాదమే ఆ దేశాన్ని తినేస్తోంది.. పాకిస్థాన్‌పై మరోసారి మండిపడ్డ జైశంకర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 18, 2025
05:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మరోసారి పాకిస్థాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముంబైలోని 19వ నాని ఏ పాల్ఖివాలా స్మారక సమావేశంలో ఆయన పాకిస్థాన్‌లో పెరుగుతున్న తీవ్రవాదం గురించి మాట్లాడారు. పాకిస్తాన్ మన పొరుగుదేశమని, కానీ అది సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందన్నారు. ఆ క్యాన్సర్ ఇప్పుడు ఆ దేశాన్ని తినేస్తోందని జైశంకర్ అన్నారు. జైశంకర్ భారతదేశం అనుసరిస్తున్న విదేశాంగ విధానంపై కూడా విశ్లేషణ చేశారు. పాకిస్తాన్ ఈ విధానాన్ని విడనాడాలని ఆసక్తి చూపుతోందన్నారు. మొత్తం ఉపఖండం పాకిస్తాన్ మాదిరి మార్పు కోరుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు.

Details

వ్యూహాత్మక ప్రయోజనాలు వేరేలా ఉంటాయి

భారత్, పశ్చిమ దేశాలకు వ్యతిరేకం కాదని, కానీ దాని వ్యూహాత్మక ప్రయోజనాలు వేరేలా ఉంటాయని ఆయన అన్నారు. భారత విదేశాంగ విధానం పరస్పర గౌరవం, సున్నితత్వం, ఆసక్తి ఆధారంగా రూపొందించారని, భారతదేశం 'విశ్వబంధు'గా, ప్రపంచంలో నమ్మకమైన భాగస్వామిగా ఉందన్నారు. స్నేహాలను పెంచడంపై దృష్టి సారించిందని జైశంకర్ వెల్లడించారు.