LOADING...
H-1B Visa: టెక్సాస్‌లో హెచ్-1బీ వీసాలకు బ్రేక్‌.. గవర్నర్‌ అబాట్‌ కీలక ఆదేశాలు
టెక్సాస్‌లో హెచ్-1బీ వీసాలకు బ్రేక్‌.. గవర్నర్‌ అబాట్‌ కీలక ఆదేశాలు

H-1B Visa: టెక్సాస్‌లో హెచ్-1బీ వీసాలకు బ్రేక్‌.. గవర్నర్‌ అబాట్‌ కీలక ఆదేశాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 28, 2026
08:08 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్ర గవర్నర్‌ గ్రెగ్‌ అబాట్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని నగరాల పరిధిలో ఉన్న విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ ఏజెన్సీలు ఇకపై కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులను వెంటనే నిలిపివేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం 2027 మే 31 వరకు అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు చేస్తూ, అమెరికాలోని ఉద్యోగాలు అక్కడి కార్మికులకే దక్కాలన్నదే తన ఉద్దేశమని గవర్నర్‌ అబాట్‌ వ్యాఖ్యానించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గవర్నర్‌ అబాట్‌ కార్యాలయం చేసిన ట్వీట్ 

Advertisement