కూలిపోయిన ఉక్రెయిన్‌లోని భారీ డ్యామ్; ఇక నీటి ప్రళయమేనా?
దక్షిణ ఉక్రెయిన్‌లోని ఒక ప్రధాన ఆనకట్ట మంగళవారం ధ్వంసమైంది. నీపర్ నదిపై ఉన్న కఖోవ్కా డ్యామ్ పేల్చేయడంతో వరదలు పోటెత్తాయి. ఫలితంగా యూరప్‌లోని అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్‌కు ఇప్పుడు ప్రమాదం ఏర్పడింది. అంతేకాకుండా తాగునీటి సరఫరాకు ముప్పు వాటిల్లింది. కఖోవ్కా డ్యామ్ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న పలు భవనాలు భారీగా దెబ్బతిన్నాయి. దాదాపు 300,000మంది జనాభా కలిగిన ఖేర్సన్‌తో సహా పలు నగరాలు దిగువన ఉన్నాయి. వరద ముంచుకొస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాలను రష్యా, ఉక్రెయిన్ ఖాళీ చేయిస్తున్నాయి. ఆనకట్ట కూలిపోవడం ఉక్రెయిన్, రష్యా ఒకరిపై ఒకరు నిందించుకున్నారు. ఆనకట్ట, జలవిద్యుత్ కేంద్రాన్ని రష్యా పేల్చేసినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. రష్యా మాత్రం ఉక్రయిన్ ఆరోపణలను ఖండించింది. దీన్ని ఉగ్రదాడిగా అవర్ణించింది.
ఆనకట్ట పేల్చివేత రెండు దేశాలకు సవాలే
దక్షిణ ఉక్రెయిన్‌లో ఉన్న ఈ డ్యామ్ వ్యూహాత్మకంగా చాలా కీలకమైందని చెప్పాలి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో కొన్ని నెలలుగా ఇరు దేశాల సైనికులు ఈ డ్యామ్ వద్దే పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. డ్యామ్ పేలడం వల్ల తోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. కఖోవ్కా ఆనకట్టను 1956లో నిర్మించారు. ఇది దాదాపు 30 మీటర్ల ఎత్తు ఉంటుంది. అంతేకాకుడండా వందల మీటర్ల పొడవు కూడా ఉంటుంది. అయితే రష్యా ఆధీనంలో ఉన్న క్రిమియాకు ఆ డ్యామ్ నీరు చాలా కీలకం. దీంతో ఈ డ్యామ్ ధ్వంసం అటు రష్యాతో పాటు, ఇటు ఉక్రెయిన్ కూడా పెద్ద సవాల్‌గా మారింది.