
Botswana : 2492 క్యారెట్ల భారీ వజ్రం లభ్యం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్దది
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రాన్ని తాజాగా బయటపడింది. ఆ వజ్రం 2492 క్యారెట్ల బరువు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
బోట్స్‌వానాలోని కరోవే గనిలో ఈ వజ్రాన్ని వెలికితీశారు.
కెనడాకు చెందిన లుకారా డైమండ్ కార్పొరేషన్ అనే సంస్థ ఈ వజ్రాన్ని కనుగొంది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రమని లుకారా డైమెండ్ కార్పొరేషన్ గురువారం వెల్లడించింది.
అయితే ఈ వజ్రం విలువు, నాణ్యత సంబంధించిన వివరాలపై ఇంకా స్పష్టత రాలేదు.
Details
ధ్రువీకరించిన బోట్స్‌వానా ప్రభుత్వం
అతిపెద్ద 2492 క్యారెట్ల వజ్రాన్ని కనుగొనడం చాలా సంతోషంగా ఉందని లుకారా డైమండ్ కార్పొరేషన్ అధ్యక్షుడు విలియం లాంబ్ చెప్పారు.
1905లో దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకూ 3106 క్యారెట్ల కల్లినల్ వజ్రమే ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రంగా నిలిచింది. తాజాగా లభించిన ఈ వజ్రం.. రెండో అతిపెద్దిగా రికార్డుకెక్కింది.
ఈ కల్లినల్ వజ్రాన్ని 9 ముక్కలు చేశారని.. వీటిలో కొన్ని జెమ్స్ బ్రిటిష్ క్రౌన్ ఆభరణాల్లో ఉన్నాయని తెలిపింది.
వజ్రాలను ఉత్పత్తి చేసే ప్రపంచ దేశాల్లో బోట్స్‌వానా ఒకటి కావడం గమానర్హం. మరోవైపు తమ దేశంలో ఇప్పటివరకూ దొరికిన వజ్రాల్లో ఇదే అతి పెద్దదని బోట్స్‌వానా ప్రభుత్వం ప్రకటించింది.