బ్రెజిల్: బోల్సోనారో మద్దతుదారుల 'మెగా నిరసన' అట్టర్ ప్లాప్
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సొనారో మద్దతుదారులు మరో విధ్వంసానికి ప్లాన్ చేయగా.. అది అట్టర్ ప్లాప్ అయ్యింది. బోల్సొనారోను తిరిగి అధ్యక్షుడిని చేసేందుకు మెగా నిరసనలో భారీగా పాల్గొనాలని సోషల్ మీడియా వేదికగా ఆందోళనకారులు పిలుపునిచ్చారు. నిరసనలను కట్టడి చేసేందుకు అధికారులు భద్రతను భారీగా మోహరించారు. అలాగే.. రోడ్లపై భారీగా నిరసనకారులు వస్తారనుుకుంటే.. చాలా తక్కువ సంఖ్యలో వచ్చారు. 29పోలీసు వాహనాలు ఉన్న రియో డి జనీరోలోని కోపకబానా బీచ్‌లో బోల్సోనారిస్ట్ నిరసనకారులను డబుల్ డిజిట్ మించలేదని మీడియా కథనాలు పేర్కొన్నాయి. బ్రెజిల్‌లో ఆందోళనలపై ఆ దేశ భద్రతాధికారులు స్పందించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఎల్లప్పుడూ గౌరవించబడుతుందన్నారు.
1,500 మంది నిరసనకారులను అరెస్ట్ చేసిన భద్రతా సిబ్బంది
బ్రెజిల్ అధ్యక్షుడు లూలా గద్దె దిగిపోవాలని డిమాండ్ చేస్తూ.. ఆదివారం అధ్యక్ష భవనం, పార్లమెంట్, సుప్రీంకోర్టులోకి 3000 మంది దూసుకెళ్లారు. గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో బోల్సోనారో ఓడించిన లూయిజ్ ఇనాసియో లులా అధ్యక్షుడయ్యారు. ఎన్నికలు సరిగా జరగలేదని బోల్సొనారో మద్దతుదారులు నిరసనకు దిగారు. 20ఏళ్ల తర్వాత కమ్యూనిష్టు పార్టీకి చెందిన లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బ్రెజిల్ తర్వాత చిలీ, కొలంబియా, అర్జెంటీనాలోనూ వామపక్షాలు తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. ఈ క్రమంలో వామపక్షాల విస్తరణను అడ్డుకునేందుకు బ్రెజిల్‌లో బోల్సొనారో మద్దతులు విధ్వంసానికి దిగినట్లు కమ్యూనిస్టు పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఆదివారం నాటి అల్లర్ల తర్వాత.. 1,500 మందిని అరెస్టు చేశారు. వందలాది మందిని జైళ్లలో నిర్బంధించారు.