
War: యుద్ధంలో అత్యంత శక్తివంతమైన దేశాలివే.. దేశాల పవర్ ఇండెక్స్ వివరాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో పరిస్థితులు క్షణక్షణం ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరాన్ మిసైల్ దాడులపై ఇజ్రాయెల్ ఎలా ప్రతిస్పందిస్తుందనేది అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తిగా మారింది.
ఇజ్రాయెల్ ఇప్పటివరకు నేరుగా ఇరాన్‌పై దాడి చేయకపోయినా, లెబనాన్ మీద దాడులు తీవ్రతరం చేస్తోంది. ఈ దాడుల్లో హెజ్బొల్లా మిలిటెంట్లతో పాటు సామాన్యులు కూడా మృత్యువాత పడుతున్నారు.
అయితే ఇరాన్‌పై నేరుగా దాడి చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
మిసైల్ దాడులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ ఇరాన్ చమురు స్థావరాలు, అణుస్థావరాలపై దాడులు చేసే అవకాశాలు లేకపోలేదు.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఇటీవలి ప్రసంగంలో ఇజ్రాయెల్ తమపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది.
Details
మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతాలు
ఈ పరిణామాలు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చి, అంతర్జాతీయంగా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఈ తరుణంలో మిడిల్ ఈస్ట్ దేశాల సైనిక బలం ఎలా ఉందో ఓసారి పరిశీలిద్దాం.
మిడిల్ ఈస్ట్‌లో ఆర్మీల బలబలాలు
1)టర్కీ
మిడిల్‌ఈస్ట్‌లో అత్యంత శక్తివంతమైన ఆర్మీ టర్కీదని పవర్ ఇండెక్స్ స్పష్టం చేస్తోంది. ఆధునిక ఆయుధాలు, సాంకేతికతతో 0.16971 స్కోరుతో టర్కీ అగ్రస్థానంలో ఉంది.
2)ఇరాన్
టర్కీ తర్వాత రెండో స్థానంలో ఉన్న ఇరాన్ 0.22691 స్కోరుతో నిలిచింది. మిసైల్ శక్తి, అధిక బలగాలు ఈ దేశం సత్తాను తెలియజేస్తున్నాయి.
Details
3)ఈజిప్టు
0.22831 స్కోరుతో మూడో స్థానంలో ఉంది. ఇది 10 లక్షలకు పైగా సైనిక బలగాలను కలిగి ఉంది.
4)ఇజ్రాయెల్
0.25961 స్కోరుతో నాల్గవ స్థానంలో ఉన్న ఇజ్రాయెల్, అత్యాధునిక ఆయుధాల పరంగా పటిష్టంగా ఉంది.
5) సౌదీ అరేబియా
ఆర్థిక వనరుల తోడుతో 0.32351 స్కోరుతో ఐదో స్థానంలో నిలిచింది.
మిగతా దేశాలు
ఇరాక్ (0.74411)
యూఏఈ (0.80831)
సిరియా (1.00261)
ఖతార్ (1.07891)
కువైట్ (1.42611)
Details
దేశాల మిలటరీల బలం ఎంతంటే
ఈ ర్యాంకింగ్స్ ఆధారంగా మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం అయితే, ప్రధానంగా టర్కీ, ఇరాన్, ఈజిప్టు, ఇజ్రాయెల్ కీలకంగా మారే అవకాశం ఉంది.
పవర్ ఇండెక్స్ స్కోరు అంటే ఏమిటి?
ఒక దేశం మిలిటరీ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి పవర్ ఇండెక్స్ స్కోరును ప్రధానంగా ఉపయోగిస్తారు.
దేశానికి ఉన్న సైనిక బలం, రవాణా సదుపాయాలు, సహజ వనరులు వంటి వివిధ అంశాల ఆధారంగా ఈ స్కోరును లెక్కిస్తారు.
ఈ స్కోరు ఆధారంగా ప్రపంచంలోని వివిధ దేశాల మిలిటరీ బలం ఎంత ఉందో తెలుసుకోవచ్చు.
Details
స్కోరులోని చిన్న ట్విస్టు
పవర్ ఇండెక్స్ స్కోరును లెక్కించేటప్పుడు అన్ని అంశాలకు సమాన ప్రాధాన్యం ఇస్తారు.
ఒక దేశానికి అత్యంత శక్తివంతమైన ఎయిర్‌ఫోర్స్ ఉండి, అదే దేశానికి నేవీ బలం తక్కువగా ఉంటే, ఆ దేశం మొత్తం స్కోరులో వెనుకపడుతుంది.
అంటే సైనిక బలాన్ని అన్ని కోణాల్లో సమతూకంగా అంచనా వేస్తారు.
అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయం ఏమనగా పవర్ ఇండెక్స్ స్కోరు ఎంత తక్కువగా ఉంటే, ఆ దేశం అంత బలంగా ఉన్నట్లు అర్థమవుతుంది.
ఇక తక్కువ స్కోరు సాధించే దేశాల మిలిటరీ బలం ఎక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.