రష్యా ప్రతినిధిపై చేయి చేసుకున్న ఉక్రెయిన్ ఎంపీ.. జెండా లాక్కున్నాడని పిడిగుద్దులుE
ఉక్రెయిన్, రష్యా మధ్య రోజు రోజుకూ ఉద్రిక్తతలు ఎక్కువ అవుతున్నాయి. ఇటీవలే రష్యా అధ్యక్షుడు పుతిన్ బిల్డింగ్ పై డ్రోన్లు తిరగడంతో రెండు దేశాల మధ్య శత్రుత్వాన్ని మరింత పెంచింది. తాజాగా తమ స్థాయి, స్థానం మరిచి రష్యా ప్రతినిధులు అంతర్జాతీయ వేదికపై గొడవకు దిగారు. ఓ రష్యన్ పై ప్రతినిధిపై ఉక్రెయిన్ ఎంపీ చేయి చేసుకోవడం సంచలనమైంది. ఓ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ కు హజరైన ఈ ఇద్దరు నేతలు చొక్కాలు పట్టుకొని కొట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. టర్కీ రాజధాని అంకారలోని ఓ సదస్సుకి ఇరు దేశాల ప్రజాప్రతినిధులు హజరయ్యారు. 14నెలలుగా ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో వారంతా ఒకే వేదికపై వచ్చారు.
పిడిగుద్దులు కురిపించిన ఉక్రెయిన్ ఎంపీ
ఉక్రెయిన్ ఎంపీ తన జెండాను ప్రదర్శిస్తున్న సమయంలో రష్యా ప్రతినిధి ఒకరు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఆ జెండాను పట్టుకొని దూరంగా వెళ్లిపోయాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఎంపీ.. ఆ రష్యా వ్యక్తిపై వేగంగా వెళ్లి అతనిపై పిడిగుద్దులు కురిపించాడు. ఆ తర్వాత జెండాను వెనక్కి తీసుకున్నాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే సిబ్బంది ఇద్దరిని విడదీశారు. ఇంటర్నేషనల్ మీటింగ్ లో ఇలా కొట్టుకోవడం ఏంటని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.