LOADING...
ఉన్మాదిగా మారి ఏడుగురు నవజాతి శిశువులను చంపిన నర్సు
ఉన్మాదిగా మారి ఏడుగురు నవజాతి శిశువులను చంపిన నర్సు

ఉన్మాదిగా మారి ఏడుగురు నవజాతి శిశువులను చంపిన నర్సు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 19, 2023
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

నవజాత శిశువుల పట్ల ఓ నర్సు ఉన్మాదిగా వ్యవహరించింది. శిశువులను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆమె ఆస్పత్రిలో ఎవరికి అనుమానం రాకుండా ఏడుగురు నవజాత శిశువులను చంపేసింది. ఇంగ్లండ్ లోని చెస్టర్ కౌంటెస్ ఆఫ్ చెస్టర్ ఆస్పత్రిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. లూసి లెబ్టీ అనే మహిళా నర్సు 2015-16 మధ్య కాలంలో ఈ హత్యలకు పాల్పడింది. ఇంజెక్షన్ ద్వారా శిశువుల రక్తంలోకి గాలిని పంపడం, నాసోగ్యాస్ట్రిక్ గొట్టాల ద్వారా కడుపులోకి పాలు, నీటిని బలవంతంగా పంపి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మరో ఆరుగురు శిశువులనూ చంపడానికి యత్నించిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై మాంచెస్టర్ క్రౌన్ కోర్టు శుక్రవారం ఆమెను దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది.

Details

తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన లూసి లెబ్టీ

భారతీయ మూలాలున్న వైద్యుడు రవి జయరాం, లూసీపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శిశు మరణాలపై 2017 మే నెలలో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఈ కేసుకు సంబంధించి ఆమెను పోలీసులు ఏడుసార్లు అరెస్టు చేశారు. తాను చెడ్డదాన్ని అని, ఉద్ధేశపూర్వకంగానే చంపానని, ఎందుకంటే పిల్లలను చూసుకునేంత మంచిదాన్ని తాను కాదని రాసి ఉన్న పేపర్లు లూసి ఇంట్లో లభ్యం కావడం గమనార్హం. అయితే లూసీ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. నవజాత శిశువుల వార్డులో లోపాలను కప్పిపుచ్చేందుకే అక్కడి సీనియర్ వైద్యులు తనపై నిందలు మోపారని ఆమె తరుపు న్యాయవాది వాదించారు.