
Donald Trump: 'అధ్యక్ష పదవి ఎంతో ప్రమాదకరం'.. డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్ష పదవికి సంబంధించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశయమ్యాయి. ఆ హోదా ఎంతటి ప్రమాదకరమో వివరించారు. శుక్రవారం వైట్‌హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, అధ్యక్ష పదవి ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, అత్యంత ప్రమాదకరమైన వృత్తులలో ఒకటని స్పష్టం చేశారు. ఈ సందర్భంలో ట్రంప్ గతేడాది పెన్సిల్వేనియాలో జరిగిన హత్యాయత్నాన్ని గుర్తుచేశారు. అధ్యక్షుడిగా పనిచేయడం కార్ రేసింగ్, బుల్ రైడింగ్ లాంటిదేనని, ఎప్పుడు ఏ ముప్పు ఎదురవుతుందో చెప్పలేమన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన పని. ఎవరైనా ముందే చెప్తే నేను ఈ రేసులో ఉండే వాడిని కానని వ్యాఖ్యానించారు.
Details
పలుసార్లు ట్రంప్ పై హత్యాయత్నాలు
ఇప్పటి వరకు ట్రంప్‌పై అనేక హత్యాయత్నాలు జరిగిన సంగతి తెలిసిందే. గతేడాది అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న సమయంలో ఓ భవనంపై నుంచి దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ట్రంప్ కుడి చెవికి గాయమైంది. అనంతరం ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో గోల్ఫ్ ఆడుతున్న ట్రంప్ సమీపానికి ఓ వ్యక్తి తుపాకీతో వచ్చాడు. ఫెన్సింగ్ వద్ద అతడిని గుర్తించిన భద్రతా సిబ్బంది కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు. అంతేకాదు, ట్రంప్ హాజరైన మరో కార్యక్రమం సమీపంలోని నేషనల్ కన్వెన్షన్ వద్ద మాస్క్ ధరించిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని బ్యాగులో AK-47 తుపాకీ ఉన్నట్లు ఫాక్స్ న్యూస్ పేర్కొంది.