Page Loader
Putin: ఉక్రెయిన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడితేనే యుద్ధానికి ముగింపు : పుతిన్
ఉక్రెయిన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడితేనే యుద్ధానికి ముగింపు : పుతిన్

Putin: ఉక్రెయిన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడితేనే యుద్ధానికి ముగింపు : పుతిన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 28, 2025
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో ప్రస్తుత జెలెన్‌స్కీ ప్రభుత్వంతో చర్చలు జరిపే ఉద్దేశ్యం తనకు లేదని పరోక్షంగా స్పష్టం చేశారు. అంతేకాదు అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ పరిణామమే యుద్ధ ముగింపునకు మార్గం సుగమం చేస్తుందని పుతిన్ సూచించారు.

Details

తాత్కాలిక ప్రభుత్వంతోనే పరిష్కారం 

ఉక్రెయిన్‌లో ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటయ్యేలా చూడాలి. అప్పుడే ఆ దేశంలో కొత్త ఎన్నికలు నిర్వహించేందుకు అనువుగా ఉంటుంది. ప్రజల విశ్వాసాన్ని పొందిన కొత్త ప్రభుత్వంతోనే శాంతి పునరుద్ధరణ కోసం చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉంటామన్నారు. అంతర్జాతీయ సమాజం గుర్తించే ఆ కొత్త ప్రభుత్వంతో యుద్ధ ముగింపుకు అవసరమైన 'చట్టబద్ధ పత్రాల'పై సంతకం చేయాలని పుతిన్ వ్యాఖ్యానించారు.