White House: ఇరాన్‌తో యుద్ధం ఆగిపోయింది.. కాంగ్రెస్‌కు తెలిపిన ట్రంప్ ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌తో జరిగిన సైనిక చర్యకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏప్రిల్‌లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతోనే ఆ యుద్ధం ముగిసిందని శ్వేతసౌధం శుక్రవారం అమెరికా కాంగ్రెస్‌కు తెలియజేసింది. ఇదే అంశంపై ఇప్పటికే సెనెట్‌లో జరిగిన విచారణకు హాజరైన అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై చేపట్టిన సైనిక చర్య 60 రోజులకు మించి కొనసాగలేదని ఆయన పేర్కొన్నారు. అందువల్ల 1973 నాటి చట్టం ప్రకారం ఆ యుద్ధానికి కాంగ్రెస్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
సుంకాన్ని 25శాతానికి పెంచుతున్నట్లు ప్రకటన
ఇక వాణిజ్య అంశాల్లో అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంతో కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని ఐరోపా సమాఖ్య (ఈయూ) అమలు చేయలేదని ఆరోపిస్తూ, అదనపు సుంకాలను విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ఈయూ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే కార్లు, ట్రక్కులపై సుంకాన్ని 25 శాతానికి పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు.