Obama-Trump: ఒబామాతో చెప్పిన మాటలు ఇవే.. సంభాషణపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య జరిగిన సీక్రెట్ సంభాషణకు సంబంధించిన దృశ్యాలు ఇటీవల నెట్టింట వైరలయ్యాయి.
తాజాగా ఈ విషయంపై ట్రంప్ స్పందిస్తూ, వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ గురించి వివరించారు.
ట్రంప్ తన వ్యాఖ్యల్లో పరస్పరం ఇష్టపడే ఇద్దరు వ్యక్తుల్లా ఇప్పుడు మనం కనిపిస్తున్నామని ఒబామాకు చెప్పా అంటూ వెల్లడించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియల సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రస్తుత అధ్యక్షుడు, ఉపాధ్యక్ష దంపతులు, ఇతర మాజీ అధ్యక్షులు హాజరయ్యారు.
ఈ సందర్భంలోనే ఒబామా, ట్రంప్‌ల మధ్య సీక్రెట్ సంభాషణ చోటు చేసుకుంది.
Details
సంబాషణపై రాజకీయ వర్గాల్లో చర్చ
ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కావడంతో, రాజకీయ ప్రత్యర్థులైన వీరిద్దరు ఏం చర్చించుకున్నారు అన్నది చర్చనీయాంశంగా మారింది.
ఈ సీక్రెట్ సంభాషణపై ఆసక్తి పెరుగుతుండగా, కొందరు లిప్ రీడర్లు దీనిని అంచనా వేయడానికి ప్రయత్నించారు.
వారి అనుమానాల ప్రకారం, ట్రంప్ ఒబామాతో ఒక విషయంపై మాట్లాడాలని కోరినట్లు, అయితే ప్రస్తుతం అది సాధ్యం కాదని, ప్రశాంతమైన ప్రదేశంలో ఆ చర్చను కొనసాగించాలని పేర్కొన్నట్లు లిప్ రీడర్లు అభిప్రాయపడ్డారు.
ఈ సంభాషణ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.