
Trump: 'వాళ్లకు మార్గమే లేదు'.. చైనా టారిఫ్‌లపై ట్రంప్ ట్వీట్ సంచలనం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా విధించిన సుంకాలకు ప్రతిస్పందనగా చైనా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. తామూ వెనుకపడే వాళ్లం కాదని చైనా స్పష్టంగా తెలిపింది.
ఈ నేపథ్యంలో అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్టు చైనా అధికారికంగా ప్రకటించింది.
ఈ తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. చైనా భయంతోనే ఈ రీతిలో చర్యలు తీసుకుందని విమర్శించారు.
వారు తప్పుడు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. చైనా వద్దకు వెళ్లే మార్గం ఇదే అని కూడా తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు.
Details
ప్రతీకారంగా 34శాతం సుంకాలు
చైనా మాత్రం అమెరికా నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఈ చర్యలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని ఆరోపించింది.
అలాగే అమెరికా ఆర్థికంగా ఒత్తిడి తేవాలని చూస్తోందని ధ్వజమెత్తింది. అందుకే ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి రానున్న విధంగా అమెరికా దిగుమతులపై 34 శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్టు స్పష్టం చేసింది.
ఇక అమెరికా విధించిన ఈ సుంకాలకు పలు దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
స్నేహపూర్వక సంబంధాలున్నా, మిత్ర దేశాలపై ఇలా సుంకాలు విధించడం తగదని పరోక్షంగా నిరసన తెలియజేశాయి.