LOADING...
German Chancellor: అమెరికాలో పరిస్థితులు మారిపోయాయి.. జర్మన్ ఛాన్సలర్ సంచలన వ్యాఖ్యలు
అమెరికాలో పరిస్థితులు మారిపోయాయి.. జర్మన్ ఛాన్సలర్ సంచలన వ్యాఖ్యలు

German Chancellor: అమెరికాలో పరిస్థితులు మారిపోయాయి.. జర్మన్ ఛాన్సలర్ సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 16, 2026
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్రెడ్రిక్ మెర్జ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. అమెరికాలో విద్య, ఉద్యోగాల కోసం వెళ్లాలనుకుంటున్న తన పిల్లలను ప్రస్తుతం తాను అంత సులభంగా ప్రోత్సహించలేనని ఆయన స్పష్టం చేశారు. అక్కడ ఇటీవల మారిపోయిన సామాజిక వాతావరణమే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. శుక్రవారం వర్జ్‌బర్గ్‌లో జరిగిన క్యాథలిక్ కాంగ్రెస్ ప్యానెల్ చర్చల్లో పాల్గొన్న మెర్జ్ మాట్లాడుతూ.. "నిజానికి నేను అమెరికాకు గొప్ప అభిమానిని. అయితే ప్రస్తుతం ఆ దేశంపై నా అభిమానం పెరగడం లేదు" అని వ్యాఖ్యానించారు. గతంలో బాగా చదువుకున్న యువత అమెరికాలో గొప్ప అవకాశాలు సాధించగలరనే నమ్మకం బలంగా ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని అన్నారు.

వివరాలు

హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచాల్సిందే

ఏడాది కిందటివరకు అమెరికాలో ఉన్నత విద్యావంతులకు విస్తృత అవకాశాలు కనిపించేవని, ప్రస్తుతం మాత్రం మంచి విద్యార్హతలు ఉన్నవారే ఉద్యోగాలు సంపాదించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మెర్జ్ అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, చైనా పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తాను ఫోన్లో మాట్లాడినట్లు మెర్జ్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన 'ఎక్స్' వేదికగా తెలియజేశారు. ఇరాన్ చర్చలకు ముందుకు రావాలని, ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచాల్సిందేనని తాము ఇద్దరం ఏకాభిప్రాయానికి వచ్చినట్లు మెర్జ్ పేర్కొన్నారు.

Advertisement