Page Loader
France: ఫ్రాన్స్ లో షాకింగ్ ఘటన.. భార్యపై 92 సార్లు అత్యాచారాలు చేయించిన భర్త
ఫ్రాన్స్ లో షాకింగ్ ఘటన.. భార్యపై 92 సార్లు అత్యాచారాలు చేయించిన భర్త

France: ఫ్రాన్స్ లో షాకింగ్ ఘటన.. భార్యపై 92 సార్లు అత్యాచారాలు చేయించిన భర్త

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 03, 2024
02:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్రాన్స్‌లో షాకింగ్ ఘటన ఒక్కటి వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి తన భార్యపై 10 సంవత్సరాల పాటు 92 సార్లు అత్యాచారాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. భార్యను మత్తులో ఉంచి, ఆన్‌లైన్‌లో నియమించిన 51 మంది పురుషులతో ఈ ఘాతానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ కేసులో నిందితుడు డొమినిక్‌ను అదుపులోకి హాజరయ్యారు. మొత్తం 72 మంది వ్యక్తులు 92 సార్లు అతని భార్యపై అత్యాచారాలకు పాల్పడ్డారని తెలుస్తోంది. వీరిలో 51 మందిని పోలీసులు గుర్తించారు. నిందితుడు డొమినిక్, ఫ్రాన్స్‌లోని పవర్ యుటిలిటీ సంస్థ ఈడీఎఫ్‌లో 71 ఏళ్ల మాజీ ఉద్యోగి అని తేల్చారు.

Details

పోలీసుల అదుపులో నిందితుడు

మొత్తం 72 మంది వ్యక్తులు 92 సార్లు అతని భార్యపై అత్యాచారాలకు పాల్పడ్డారని తెలుస్తోంది. వీరిలో 51 మందిని పోలీసులు గుర్తించారు. నిందితుడు డొమినిక్, ఫ్రాన్స్‌లోని పవర్ యుటిలిటీ సంస్థ ఈడీఎఫ్‌లో 71 ఏళ్ల మాజీ ఉద్యోగి అని తేల్చారు. అత్యాచారాలకు పాల్పడిన నిందితుల వయసు 26 నుండి 74 సంవత్సరాల మధ్య ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భార్యకు అధిక మోతాదులో డ్రగ్స్ ఇచ్చిన కారణంగా, ఆమె 10 సంవత్సరాల పాటు జరుగుతున్న ఈ అఘాయిత్యాలను గుర్తించలేకపోయిందని తెలిపారు. నిందితుడి డొమినిక్‌ కంప్యూటర్‌ను పరిశీలించినప్పుడు, భార్యకు సంబంధించిన వందలాది వీడియోలు కనిపించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.