Page Loader
Texas floods: టెక్సాస్‌ వరద భీభత్సం.. క్షణాల్లో రహదారి మాయం.. సోషల్ మీడియాలో వైరల్‌ వీడియో..!
టెక్సాస్‌ వరద భీభత్సం.. క్షణాల్లో రహదారి మాయం.. సోషల్ మీడియాలో వైరల్‌ వీడియో..!

Texas floods: టెక్సాస్‌ వరద భీభత్సం.. క్షణాల్లో రహదారి మాయం.. సోషల్ మీడియాలో వైరల్‌ వీడియో..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2025
12:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రాన్ని వరదలు వణికిస్తున్నాయి. తాజాగా అక్కడ జరిగిన విపత్కర పరిస్థితుల్లో మరణించిన వారి సంఖ్య 82కి పెరిగింది. ఇంకా చాలామంది ఆచూకీ లేకుండా పోవడం గమనార్హం. కెర్‌ కౌంటీలో జరిగిన ఈ విపత్తులో 40 మంది వయోజనులు, 28 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ఇటీవల లానో నది, కింగ్స్‌ల్యాండ్‌ స్లాబ్‌ ప్రాంతంలో రికార్డ్‌ చేసిన ఒక వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్‌ అవుతోంది. జూలై 4న తీసిన ఈ వీడియోలో కేవలం కొన్ని నిమిషాల్లోనే వరద ప్రవాహం అప్రతిహతంగా దూసుకెళ్లిన దృశ్యం కనిపిస్తోంది. దారిలో ఉన్న ప్రతి వస్తువును ఉతికి పారేసిన ఆ ప్రవాహం, మెరుపు వరద ఎంత భీకరంగా ఉంటుందో ప్రత్యక్షంగా చూపిస్తోంది.

వివరాలు 

కనిపించకుండా పోయిన వారిలో పదిమంది బాలికలు, ఒక కౌన్సలర్‌

ఇక సోమవారం రోజూ మరోసారి భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికీ సుమారు 41 మంది కనిపించకుండా పోయారు. ఈక్రమంలో అధికార యంత్రాంగం వారికోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. కనిపించకుండా పోయిన వారిలో క్యాంప్‌ మైస్టిక్‌ ప్రాంతానికి చెందిన పదిమంది బాలికలు, ఒక కౌన్సలర్‌ ఉన్నారు. గ్వాడల్పే నది సమీపంలో ఉన్న ఈ క్యాంప్‌ కేవలం రెండు గంటల వ్యవధిలోనే 20 అడుగుల నీటిలో పూర్తిగా మునిగిపోయింది. ఇక వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా సందర్శించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సిద్ధమవుతున్నారు. టెక్సాస్‌ రాష్ట్రాధికారులతో కలిసి సహాయ చర్యల్లో భాగస్వామ్యమవుతున్నట్టు ట్రంప్‌ వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో ఇదే..!