Page Loader
Tokyo-Haneda airport : ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీ.. చెలరేగిన మంటలు.. ప్రాణాలతో ఎంతమంది బయటపడ్డారంటే
ప్రాణాలతో ఎంతమంది బయటపడ్డారంటే

Tokyo-Haneda airport : ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీ.. చెలరేగిన మంటలు.. ప్రాణాలతో ఎంతమంది బయటపడ్డారంటే

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jan 02, 2024
05:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

జపాన్ రాజధాని టోక్యోలో అత్యంత రద్దీగా ఉండే హనేడా ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం జరిగింది. రన్ వేపై ఉన్న జపాన్ ఎయిర్ లైన్స్‌కి చెందిన ప్యాసింజర్ విమానాన్ని కోస్ట్ గార్డు విమానం ఢీకొంది. ఘటనతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో 367 మంది ప్రయాణికులను, 12 మంది సిబ్బందిని ఎయిర్ పోర్టు నుంచి సురక్షితంగా తరలించారు. ప్రయాణికుల విమానం అత్యంత వేగంగా రన్ వేపై వెళ్తూ మంటల్లో చిక్కుకోవడం అధికారులను, ఫ్యాసింజర్స్'ను ఆందోళన కలిగించింది. జపాన్ ఎయిర్‌లైన్స్(JAL) ఎయిర్‌బస్ A350 విమానాన్ని కోర్టు గార్డ్ విమానం ఢీకొట్టినట్లు తెలుస్తోంది. మంటలు అర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు.

Details

అన్ని కార్యకలాపాలు బంద్

జపాన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 516లో 12 మంది సిబ్బందితో సహా 379 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వీరిని హుటాహుటిన రెస్క్యూ చేశారు. MA722 ఫిక్స్‌డ్‌ వింగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌‌ని ఢీకొట్టడంపై దర్యాప్తు చేస్తున్నట్లు జపాన్ కోస్ట్ గార్డ్ వెల్లడించింది. తమ విమానంలో ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు గుర్తించామని కోస్ట్ గార్డ్ వివరించింది. ప్రమాదానికి గురైన జపాన్ ఎయిర్‌లైన్స్ 516 ఎయిర్ బస్ A-350 ప్యాసింజర్ జెట్ జపాన్ లోని షిన్ చిటోస్ నుంచి టోక్యోలోని అత్యంత రద్దీగా ఉండే హనెడాకు వెళ్లినట్లు స్థానిక మీడియా కథనం వెలువరించడం గమనార్హం. ప్రమాదం కారణంగా హనేడా విమానాశ్రయం అన్ని రన్ వేలపై కార్యకలాపాలు నిలిచిపోయాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రన్ వేపై కాలిపోతున్న ఫ్లైట్