LOADING...
Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం!
ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం!

Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 04, 2025
05:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

వంటలన్నింటిలోనూ టమాటో ముఖ్యమైన పదార్థం. కూరలు, పప్పులు, సలాడ్లు, బిర్యానీ వంటి ఎన్నో వంటకాలలో టమాటో తప్పనిసరిగా వాడతారు. అందంగా ఎర్రగా ఉండే ఈ పండు.. ఆరోగ్యానికి మేలు చేస్తుంది కాబట్టే వంటల్లో అనివార్యంగా మారింది. కానీ ఇప్పుడు టమాటో వాడకంలో జాగ్రత్త అవసరం, ఎందుకంటే వాటిలో ఒక ప్రమాదకరమైన బ్యాక్టీరియా కనిపించింది. అగ్రరాజ్యం అమెరికాలోని టమాటోల్లో 'సాల్మొనెల్లా' అనే ఇన్ఫెక్షన్‌ వెలుగుచూసింది. ఈ విషయాన్ని గుర్తించిన ఆ దేశ ఆహార నియంత్రణ సంస్థ (FDA) టమాటోలను రీకాల్ చేయాలని, వినియోగదారులు వాటిని వాడకూడదని హెచ్చరించింది.

Details

టమాటోల్లో పాజిటివ్‌గా కనిపించిన సాల్మొనెల్లా

ఈ ఇన్ఫెక్షన్ తీవ్రమైన అనారోగ్య పరిస్థితులకు కారణమవుతుందని FDA ప్రకటించింది. 2024 మే 28న క్లాస్-1 కేటగిరీలో హెచ్చరిక జారీ చేసింది . దీని ప్రభావంతో జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా రాష్ట్రాల్లో టమాటో సరఫరాను నిలిపివేశారు. టమాటో పండిస్తున్న కొంతమంది రైతులు స్వచ్ఛందంగా తమ సరుకును వెనక్కి తీసుకున్నారు. ఫ్రీజర్‌లోనూ బతికే బ్యాక్టీరియా! సాల్మొనెల్లా బ్యాక్టీరియా పొడి లేదా వెచ్చని వాతావరణంలో కొన్ని వారాల పాటు, ఫ్రీజర్ లేదా తేమతో కూడిన ప్రదేశాల్లో నెలల తరబడి బతికేస్తుంది. అందుకే ప్రజలు టమాటోలను తినకుండా, తిరిగి ఇచ్చేయాలని FDA సూచిస్తోంది. వాటిని పొరపాటున కూడా వాడరాదు.

Details

ప్రభావితులపై ఇంకా క్లారిటీ లేదు

ఈ ఇన్ఫెక్షన్‌ వల్ల ఇప్పటివరకు ఎవరికైనా అనారోగ్యం కలిగిందా లేదా మరణాలు సంభవించాయా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, సాల్మొనెల్లా అనేది ఆహారాల ద్వారా సోకే బ్యాక్టీరియా. దీని వల్ల జ్వరం, విరేచనాలు, వికారం, వాంతులు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. చిన్నపిల్లలు, వృద్ధుల రోగనిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

Details

అమెరికాలో భారీ ఉత్పత్తి

అమెరికా ప్రపంచంలోనే టమాటోను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాలలో ఒకటి. దేశంలోని 20కిపైగా రాష్ట్రాల్లో టమాటోలు పండిస్తారు. ఫ్లోరిడా, కాలిఫోర్నియా రాష్ట్రాలు టాపులో ఉంటాయి. 2023లో అమెరికాలో 2.5 లక్షల ఎకరాల్లో టమాటో పంట సాగు జరిగింది. ఎకరానికి సగటు దిగుబడి 50 టన్నులుగా నమోదైంది. మొత్తం ఉత్పత్తి విలువ రూ. 6,150 కోట్లు (\$715.6 మిలియన్). తినే ప్రతి పదార్థంపై అప్రమత్తంగా ఉండాలి. తాజా టమాటోలు ఆరోగ్యానికి మేలు చేస్తే.. ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటే ప్రాణాంతకమవుతాయి. కాబట్టి టమాటోలు కొనేటప్పుడు, వాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి.