LOADING...
Most Expensive Diamonds: కోహినూర్‌కు సమానంగా నిలిచే వజ్రాలివే… వీటి విలువ తెలిస్తే షాక్ అవుతారు!
కోహినూర్‌కు సమానంగా నిలిచే వజ్రాలివే… వీటి విలువ తెలిస్తే షాక్ అవుతారు!

Most Expensive Diamonds: కోహినూర్‌కు సమానంగా నిలిచే వజ్రాలివే… వీటి విలువ తెలిస్తే షాక్ అవుతారు!

వ్రాసిన వారు Moogati Shabari
Apr 03, 2026
01:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ రోజుల్లో బంగారం, వజ్రాలను చాలా మంది తమ ప్రతిష్ఠకు సూచికలుగా భావిస్తున్నారు. అయితే కొన్ని వజ్రాలు ధరలు వింటే, సాధారణ ప్రజలే కాకుండా ధనవంతులకే ఆశ్చర్యం కలుగుతుంది. వేల కోట్ల రూపాయల విలువైన ఈ అరుదైన ఆభరణాలను అత్యంత భద్రతతో, బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్‌లో ఉంచి సంరక్షిస్తారు. భారతదేశంలోని గోల్కొండ గనుల నుంచి లభించిన హోప్ డైమండ్ నుండి రంగురంగుల పింక్ వజ్రాల వరకు ప్రపంచంలో అత్యంత విలువైన కోహినూర్‌కు సమానమైన వజ్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వివరాలు 

డైమండ్ రకాలివే..

హోప్ డైమండ్: ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది భారతదేశానికి చెందిన హోప్ డైమండ్. 45.52 క్యారెట్ల బరువున్న ఈ నీలి వజ్రం గోల్కొండ గనుల్లో కనుగొనబడింది. దీని విలువ సుమారు 250 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.2085 కోట్లు). ప్రస్తుతం ఇది వాషింగ్టన్‌లోని స్మిత్సోనియన్ మ్యూజియంలో ఉంది. గ్రాఫ్ పీకాక్ బ్రోచ్ : నెమలి ఆకారంలో రూపొందించిన ఈ ఆభరణం ఒక అద్భుత కళాఖండం. ఇందులో మొత్తం 1,305 రంగురంగుల వజ్రాలు అమర్చబడ్డాయి. మధ్యలో ఉన్న 20 క్యారెట్ల నీలి వజ్రం దీనికి ప్రత్యేక ఆకర్షణ. దీని విలువ సుమారు 100 మిలియన్ డాలర్లు.

వివరాలు

ఈ డైమండ్స్ గురించి విన్నారా..

విట్టెల్స్‌బాచ్-గ్రాఫ్ డైమండ్: 17వ శతాబ్దానికి చెందిన ఈ చారిత్రాత్మక నీలి వజ్రం యూరప్ రాజవంశాల వద్ద ఉండేది. 2008లో లారెన్స్ గ్రాఫ్ దీనిని కొనుగోలు చేసి మరింత మెరుగులు దిద్దారు. ప్రస్తుతం దీని అంచనా విలువ సుమారు 80 మిలియన్ డాలర్లు. పింక్ స్టార్ డైమండ్ : 59.60 క్యారెట్ల బరువున్న ఈ పింక్ వజ్రాన్ని తయారు చేయడానికి సుమారు రెండు సంవత్సరాలు పట్టింది. 2017లో హాంగ్‌కాంగ్‌లో జరిగిన వేలంలో ఇది 71.2 మిలియన్ డాలర్లకు అమ్ముడై ప్రపంచ రికార్డు సృష్టించింది. ఓపెన్‌హైమర్ బ్లూ : నీలి వజ్రాలలో ప్రత్యేక స్థానం సంపాదించిన ఈ వజ్రం 14.62 క్యారెట్ల బరువు కలిగి ఉంది. దీని ధర 57.5 మిలియన్ డాలర్లు.

Advertisement

వివరాలు 

ఈ ఆభరణాల గురించి మీకు తెలుసా?

మెమరీ ఆఫ్ ఆటమ్ లీవ్స్ : పింక్, బ్లూ రంగుల కలయికతో రూపొందించిన ఈ ఇయర్ రింగ్స్ జంట 2017లో వేలంలో విక్రయించబడ్డాయి. అప్పట్లో వీటి ధర సుమారు రూ.478 కోట్లు. ఎల్-ఇన్ కంపేరబుల్ : ఈ ఆభరణానికి ప్రత్యేకమైన కథ ఉంది. కాంగోలో ఒక చిన్నారికి చెత్త కుప్పలో దొరికిన 407 క్యారెట్ల పసుపు వజ్రం దీనిలో ప్రధాన ఆకర్షణ. దీని విలువ సుమారు రూ.458 కోట్లు. విన్స్టన్ పింక్ లెగసీ : 18.96 క్యారెట్ల ఈ పింక్ వజ్రం తన ప్రత్యేకమైన రంగుతో ప్రసిద్ధి చెందింది. 2018లో ఇది 50.7 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.420 కోట్లు) అమ్ముడై చరిత్రలో నిలిచింది.

Advertisement