
హమాస్ టాప్ కమాండర్ హతం.. గాజాపై భూమి, వాయు, జల మార్గాల్లో ఇజ్రాయెల్ దాడి
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ఏడో రోజుకు చేరుకుంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) దళాలు గాజాలోకి ప్రవేశించి హమాస్ మిలిటెంట్లపై విరుచుకుపడుతున్నాయి.
ఈ దాడిలో హమాస్ టాప్ కమాండర్ బిల్లాల్ అల్-ఖేద్రా హతమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
మరోవైపు, హమాస్ మిలిటెంట్లను తుద ముట్టించేందుకు గాజాపై ఇజ్రాయెల్ సైన్యం ముప్పేట దాడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
గాజాపై వాయు, భూమి, జల మార్గాల్లో దాడులు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సైన్యం ప్రకటించింది.
గాజా సరిహద్దులో పఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సైనికులతో సమావేశమై కొద్ది సేపు ముచ్చటించారు.
ఈ సందర్భంగా మరింత సైన్యం యుద్ధం పాల్గొంటుందని ఆయన వెల్లడించారు. ఈ యుద్ధంలో ఇరు దేశాల్లో కలిపి ఇప్పటి వరకు 3,500 మంది చనిపోయారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
టాప్ కమాండర్ బిల్లాల్ అల్-ఖేద్రా హతం
Top #Hamas commander killed in Gaza; India Today’s @gauaravcsawant joins in for more
— IndiaToday (@IndiaToday) October 15, 2023
LIVE | @aispaliwal pic.twitter.com/I5QAzyp1D7