LOADING...
Israel: 'ప్రభుత్వాన్ని కూల్చండి'.. ఇరాన్ ప్రజలకు నెతన్యాహూ పిలుపు
'ప్రభుత్వాన్ని కూల్చండి'.. ఇరాన్ ప్రజలకు నెతన్యాహూ పిలుపు

Israel: 'ప్రభుత్వాన్ని కూల్చండి'.. ఇరాన్ ప్రజలకు నెతన్యాహూ పిలుపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 01, 2026
04:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో ఇజ్రాయిల్ ఇరాన్‌పై ఘోరమైన దాడులు మొదలు పెట్టింది. శనివారం అమెరికాతో కలిసి చేపట్టిన దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించగా, ఆయన కుటుంబ సభ్యులూ హతమయ్యారు. ఈ ఘటన తర్వాత ఇరాన్ ప్రతీకార చర్యలతో యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, బహ్రైయిన్, ఒమన్‌లను లక్ష్యంగా మిస్సైల్స్, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ముఖ్యంగా దుబాయ్, ఖతార్ సిటీ, అబుదాబిలపై దాడులు జరిగినాయి. ఇక తాజాగా ఇజ్రాయిల్ టెహ్రాన్‌పై కూడా ఘోర దాడులు జరిపింది. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇరాన్‌కు కఠిన హెచ్చరికలు జారీ చేస్తూ, ఆ దేశంలోని అన్ని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తామని ప్రకటించారు.

Details

ప్రతీ తరానికి ఒక్కసారే వచ్చే అవకాశం

ఆయన ఇరాన్ ప్రజలకు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని కూల్చి నిరంకుశ పాలనను ముగించమని పిలుపునిచ్చారు. సుప్రీంలీడర్ ఖమేనీ మరణం తర్వాత నెతన్యాహూ ఒక వీడియో సందేశంలో మాట్లాడారు. ఇజ్రాయిల్ దాడులు ఇరాన్ సైనిక, పాలన వ్యవస్థలను బలహీనపరుస్తాయని, పౌరులు "ఉగ్రవాద పాలన"కు ఎదురుదెబ్బలు తిప్పే పరిస్థితిని సృష్టిస్తాయని తెలిపారు. ఇరానియన్లు, పర్షియన్లు, కుర్దులు, అజెరిలు, అహ్వాజీలు, బలూచిలతో సహా అన్ని జాతుల ప్రజలు వీధుల్లోకి రాగలిగితే పాలన వ్యవస్థను కూల్చివేయగలరని చెప్పారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ సమయంలో ఇరాన్ నాయకత్వాన్ని తొలగించడం ఇజ్రాయెల్ సైనిక లక్ష్యాలలో భాగమని ఆయన స్వయంగా స్పష్టం చేశారు. ప్రతీ తరానికి ఒక్కసారే వచ్చే అవకాశమని, ఇరాన్ ప్రజలు ధైర్యంగా వ్యవస్థను మార్చే అవకాశం ఉందని ఆయన ఉద్దేశించారు.

Advertisement