Loading...
Biman Bangladesh Airlines: విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ.. వైరల్‌గా మారిన వీడియో
విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ.. వైరల్‌గా మారిన వీడియో

Biman Bangladesh Airlines: విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ.. వైరల్‌గా మారిన వీడియో

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2026
12:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిమాన్‌ బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఇద్దరు ప్రయాణికులు పరస్పరం దాడి చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. లండన్‌ నుంచి ఢాకాకు వెళ్తున్న విమానంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య తొలుత వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం మాటామాటా పెరగడంతో అది ఘర్షణకు దారితీసింది. ఆగ్రహంతో ఇరువురు ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి షర్టు చిరిగిపోయింది.

వివరాలు 

భద్రతపై నెటిజన్లు ఆందోళన

ప్రయాణికుల మధ్య జరిగిన కొట్లాటతో విమానంలోని తోటి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు క్యాబిన్‌ సిబ్బంది, ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకొని ఇరువురిని సర్దిచెప్పారు.

దీంతో కొద్దిసేపటి తర్వాత గొడవ సద్దుమణిగింది. అయితే ఈ ఘర్షణకు అసలు కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు.

ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండటంతో ప్రయాణికుల భద్రతపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై విచారణ చేపట్టనున్నట్లు బిమాన్‌ బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్స్‌ జనరల్‌ మేనేజర్‌ మహబూబుద్దీన్‌ అహ్మద్‌ తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లండన్‌-ఢాకా విమానంలో ప్రయాణికుల కొట్లాట..  

ADVERTISEMENT