Page Loader
Bangladesh: విమాన ప్రమాదం కలకలం.. పాఠశాలపై కూలిన ఫైటర్ జెట్!
విమాన ప్రమాదం కలకలం.. పాఠశాలపై కూలిన ఫైటర్ జెట్!

Bangladesh: విమాన ప్రమాదం కలకలం.. పాఠశాలపై కూలిన ఫైటర్ జెట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 21, 2025
02:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాజధాని ఢాకాలోని ఓ కాలేజీ ప్రాంగణంలో F-7 ట్రైనింగ్ ఫైటర్ జెట్ అకస్మాత్తుగా కుప్పకూలింది. ఘటన జరిగిన వెంటనే విమానం నుండి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఊహించని ప్రమాదంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో వారు అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.