
China Internet: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ను ప్రారంభించిన చైనా
ఈ వార్తాకథనం ఏంటి
ఇంటర్నెట్ రంగంలో చైనా అపూర్వ విజయాన్ని సాధించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను చైనా ఆవిష్కరించింది.
సింఘువా యూనివర్సిటీ, చైనా మొబైల్, హువాయ్ టెక్నాలజీస్, సెర్నెట్ కార్పొరేషన్ సహకారంతో ఈ నెట్‌వర్క్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసింది.
కొత్తగా ప్రారంభించిన ఇంటర్నెట్ వేగం ఏకంగా 1.2 టీబీ కావడం గమనార్హం.
ఈ ఇంటర్నెట్ వేగం ప్రస్తుతం ఉన్న 5జీ కంటే దాదాపు పది రెట్లు ఎక్కువ.
వాస్తవానికి 2025లో చైనా ఈ హైస్పీడ్ ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను ఆవిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే అనుకున్న లక్ష్యం కంటే ముందుగా చైనా ఆవిష్కరించింది.
చైనా
150 హై-డెఫినిషన్ సినిమాలను ఒక్క సెకనులో ట్రాన్స్ఫర్ చేయొచ్చు
చైనా ఆవిష్కరించిన నెట్‌వర్క్ నిజంగా ఎంత వేగవంతమైనదో Huawei టెక్నాలజీస్ వైస్ ప్రెసిడెంట్ వాంగ్ లీ చెప్పారు.
ఈ నెట్ అనేది ఒక సెకనులో 150 హై-డెఫినిషన్ సినిమాలకు సమానమైన డేటాను ట్రాన్స్ఫర్ చేయొచ్చని వివరించారు.
3,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తరించి ఉన్న ఈ నెట్‌వర్క్, విస్తృతమైన ఆప్టికల్ ఫైబర్ కేబులింగ్ సిస్టమ్ ద్వారా బీజింగ్, వుహాన్, గ్వాంగ్‌జౌలను కలుపుతుందని చైనా చెబుతోంది.
ఈ నెట్‌వర్క్ సెకనుకు 1.2 టెరాబిట్‌లు అంటే 1,200 గిగాబిట్‌ల వేగంతో ఉంటుంది.
ప్రపంచంలోని చాలా ఇంటర్నెట్ బ్యాక్‌బోన్ నెట్‌వర్క్‌లు సెకనుకు 100 గిగాబిట్‌లు మాత్రమే పనిచేస్తాయి. యూఎస్ ఇటీవలే దాని 5వ తరం ఇంటర్నెట్‌ని ఆవిష్కరించింది.