భారత్‌తో సన్నిహిత సంబంధాలకు కెనడా కట్టుబడి ఉంది: ట్రూడో
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందని "విశ్వసనీయమైన ఆరోపణలు" ఉన్నప్పటికీ, కెనడాతో సన్నిహిత సంబంధాలను నెలకొల్పడానికి కెనడా ఇప్పటికీ కట్టుబడి ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో శుక్రవారం అన్నారు. భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తి. గత సంవత్సరంలోనే మేము ఇండో-పసిఫిక్ వ్యూహంతో ముందుకొచ్చాం.మేము భారతదేశంతో సన్నిహిత సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై చాలా ఆసక్తిని కలిగి ఉన్నామన్నారు. అదే సమయంలో, సహజంగానే, చట్టబద్ధమైన దేశంగా, ఈ విషయంలో పూర్తి వాస్తవాలను పొందేలా భారత్ కెనడాతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని మాంట్రియల్‌లో విలేకరుల సమావేశంలో ట్రూడో అన్నారు.
భారత్ కెనడాతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది: ట్రూడో
అమెరికన్లు మాతో ఉన్నారు: ట్రూడో
కెనడా,దాని మిత్రదేశాలు భారత్‌తో "నిర్మాణాత్మకంగా పని చెయ్యాల్సి ఉందన్నారు. కానీ అదే సమయంలో చట్టాలను అనుసరించే దేశంగా.. నిజ్జర్ హత్య విషయంలో మాతో కలిసి భారత్ వాస్తవాలను వెలికితీయాలని తాను భావిస్తున్నట్లు ట్రూడో అన్నారని కెనడియన్ మీడియా నేషనల్ పోస్ట్ నివేదించింది. ఎస్ జైశంకర్‌తో జరిగిన సమావేశంలో నిజ్జర్ హత్యలో భారత్ పాత్రపై బహిరంగంగా చేసిన ఆరోపణలను విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ లేవనెత్తుతారని అమెరికా హామీ ఇచ్చిందని కెనడా ప్రధాని చెప్పారు. కెనడియన్ గడ్డపై కెనడియన్ పౌరుడిని భారత ప్రభుత్వ ఏజెంట్లు హత్య చేశారనే విషయంలో అమెరికన్లు మాతో ఉన్నారు" అని ట్రూడో అన్నారు.