Loading...
New OPT fee proposed: అమెరికాలో విదేశీ విద్యార్థులకు భారీ షాక్‌.. ఓపీటీకి 70 వేల డాలర్ల ఫీజు!.
అమెరికాలో విదేశీ విద్యార్థులకు భారీ షాక్‌.. ఓపీటీకి 70 వేల డాలర్ల ఫీజు!.

New OPT fee proposed: అమెరికాలో విదేశీ విద్యార్థులకు భారీ షాక్‌.. ఓపీటీకి 70 వేల డాలర్ల ఫీజు!.

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 08, 2026
08:25 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి,ఆ తర్వాత అక్కడే ఉద్యోగం చేయాలనుకునే విదేశీ విద్యార్థులకు ట్రంప్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త విధానం ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో చదివిన తమ మేజర్‌ సబ్జెక్టుకు సంబంధించిన రంగంలో ప్రాక్టికల్‌ అనుభవం పొందేందుకు ఉపయోగపడే ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(OPT)కార్యక్రమంలో చేరాలంటే భారీ ఫీజు చెల్లించేలా హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం బుధవారం ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదన ప్రకారం.. OPT కింద పనిచేయడానికి దరఖాస్తు చేసుకునే ప్రతి అంతర్జాతీయ విద్యార్థి తరఫున సంబంధిత అమెరికా విద్యా సంస్థ 70వేల డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న పని అనుమతిని పొడిగించుకునే సమయంలో ప్రతి రెన్యువల్‌కు 30వేల డాలర్లు చొప్పున ఫీజు చెల్లించాలనే నిబంధనను కూడా ప్రతిపాదించారు.

వివరాలు 

STEM విద్యార్థులకు మొత్తం మూడేళ్లపాటు అమెరికాలో ఉద్యోగం చేసే అవకాశం

ఈ మొత్తాన్ని విద్యార్థులు నేరుగా చెల్లించాల్సిన అవసరం లేకుండా, సంబంధిత కాలేజీలు లేదా యూనివర్సిటీలే భరించాల్సి ఉంటుందని ప్రతిపాదనలో పేర్కొన్నారు.

అమెరికా నిబంధనల ప్రకారం.. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులు సాధారణంగా మరో ఏడాది పాటు ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది.

అయితే సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌ (STEM) విభాగాల్లో చదివిన విద్యార్థులకు అదనంగా రెండేళ్లపాటు పని చేసుకునే వెసులుబాటు ఉంది.

దీంతో అర్హత ఉన్న STEM విద్యార్థులకు మొత్తం మూడేళ్లపాటు అమెరికాలో ఉద్యోగం చేసే అవకాశం లభిస్తుంది.

అయితే కొత్త ఫీజు ప్రతిపాదన అమల్లోకి వస్తే విదేశీ విద్యార్థులను ఆకర్షించే అమెరికా కాలేజీలు, యూనివర్సిటీలపై ఆర్థిక భారం పడే అవకాశం ఉంది.

వివరాలు 

రెన్యువల్‌కు మరో 30 వేల డాలర్ల ఫీజు

అంతర్జాతీయ విద్యార్థుల నుంచి వచ్చే ఆదాయంపై ఆధారపడే విద్యా సంస్థలకు ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపొచ్చని భావిస్తున్నారు.

మరోవైపు విదేశీ విద్యార్థులను పెద్ద సంఖ్యలో నియమించుకునే టెక్నాలజీ కంపెనీలు, ఇతర పరిశ్రమలు కూడా సిబ్బంది కొరతను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.

మొత్తంగా.. OPT కార్యక్రమం ద్వారా అమెరికాలో చదువు పూర్తయ్యాక ఉద్యోగ అనుభవం పొందాలనుకునే విదేశీ విద్యార్థులకు సంబంధించిన ఖర్చులు భారీగా పెరిగేలా ఈ ప్రతిపాదన ఉంది.

దరఖాస్తు సమయంలో 70 వేల డాలర్లు, అనుమతి పొడిగింపు కోసం ప్రతి రెన్యువల్‌కు మరో 30 వేల డాలర్ల ఫీజు చెల్లించే విధంగా ట్రంప్‌ యంత్రాంగం ప్రతిపాదించింది.

ADVERTISEMENT