
US: అమెరికాలో 55 మిలియన్ల విదేశీయుల వీసాల పరిశీలన.. వెల్లడించిన ట్రంప్ ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం,అమెరికాలో ప్రస్తుతం నివసిస్తున్న సుమారు 5.5 కోట్ల మంది విదేశీయుల వీసా పత్రాలను సవివరంగా పరిశీలించే ప్రక్రియ ప్రారంభమైంది. ఎవరైనా వీసా నిబంధనలను ఉల్లంఘించారా లేదా అన్నది నిర్ధారించడం ఈ పరిశీలన ప్రధాన ఉద్దేశ్యమని గురువారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. అధికారుల సమాచారం ప్రకారం, నేరాలు చేసినవారు, ఉగ్రవాద చర్యలకు పాల్పడినవారు, ఉగ్రవాద సంస్థలకు మద్దతు తెలిపినవారు, వీసా గడువు ముగిసినా అమెరికాలోనే కొనసాగుతున్నవారు లేదా ప్రజా భద్రతకు ముప్పు కలిగిస్తున్నవారు - ఇలాంటి వారందరినీ గుర్తించి, వారిని తమ స్వదేశాలకు వెనక్కి పంపే చర్యల భాగంగా ఈ కసరత్తు చేపట్టినట్లు తెలియజేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
5.5 కోట్ల మంది విదేశీయుల వీసాల పరిశీలన చేయనున్న ట్రంప్ ప్రభుత్వం
BREAKING: The Trump administration to review all 55 million visa holders in the US for possible deportation, AP reports. pic.twitter.com/ddhAJsanJ9
— Resist the Mainstream (@ResisttheMS) August 21, 2025