
Donald Trump: మళ్లీ ట్రంప్ నోట జీరో టారిఫ్.. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి జీరో టారిఫ్‌ల అంశాన్ని ప్రస్తావించారు. భారత్ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే అనేక వస్తువులపై జీరో టారిఫ్‌లను ఆఫర్ చేసిందని స్పష్టం చేశారు.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న సమయంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు విశేష ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ భారతదేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, 'ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటి' అని వ్యాఖ్యానించారు. అయితే భారత్ తమ దేశం నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై 100 శాతం సుంకం తగ్గించేందుకు అంగీకరించిందని తెలిపారు. వాణిజ్య ఒప్పందం విషయమై మాట్లాడుతూ ఇటీవల ఒప్పందంపై తక్షణ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు.
Details
చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి : ట్రంప్
ప్రపంచంలోని అనేక దేశాలు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఉత్సాహం చూపుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు.
ఇది ద్వైపాక్షిక వాణిజ్య చర్చలపై అమెరికా చూపిస్తున్న దృష్టికోణాన్ని హైలైట్ చేస్తోంది.
ఇక మరోవైపు, ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కూడా స్పందించారు. "భారత్-అమెరికా మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.
ఇవి చాలా సంక్లిష్టమైన చర్చలు. ప్రతి అంశంపై స్పష్టత వచ్చేంత వరకు చర్చలు కొనసాగుతూనే ఉంటాయి. వాణిజ్య ఒప్పందం పరస్పర ప్రయోజనాలపై ఆధారపడి ఉండాలి. ఒప్పందం పూర్తయ్యేదాకా ప్రకటించడం తొందరపాటవుతుందని ట్రంప్ పేరును ప్రస్తావించకుండానే ఆయన వ్యాఖ్యానించారు.
ఈ పరిణామాలు చూస్తుంటే, వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం అంత సులభం కాదన్న విషయం స్పష్టమవుతోంది.