LOADING...
Donald Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమానంలో సాంకేతిక సమస్య
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమానంలో సాంకేతిక సమస్య

Donald Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమానంలో సాంకేతిక సమస్య

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 21, 2026
10:09 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి స్విట్జర్లాండ్‌కు బయలుదేరిన సమయానికి,ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ కారణంగా విమానం యు-టర్న్ తీసుకొని తిరిగి వాషింగ్టన్‌ డీసీకి మళ్లించబడినట్లు వర్గాలు తెలిపారు. ప్రస్తుతం దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ట్రంప్ మంగళవారం వాషింగ్టన్ నుండి స్విట్జర్లాండ్ వైపు బయలుదేరగా, ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ఎలక్ట్రికల్ సమస్య తలెత్తింది. వెంటనే పైలట్లు విమానాన్ని తిరిగి అమెరికాకు మళ్లించారు, అని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎయిర్‌పోర్స్ వన్‌లో సాంకేతిక లోపం.. దావోస్ వెళ్తుండగా సమస్య

Advertisement