
Charlie Kirk: డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు కన్జర్వేటివ్ యాక్టివిస్ట్‌పై హత్య
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితుడు,ప్రముఖ కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ (31) హత్యకు గురయ్యారు. ఈ సంఘటన యుటా స్టేట్‌లోని వ్యాలీ యూనివర్సిటీలో మాస్ షూటింగ్స్‌పై చర్చ నిర్వహిస్తున్న సమయంలో జరిగింది. చార్లీ కిర్క్ ఒక విద్యార్థి ప్రశ్నకు సమాధానం ఇస్తూ టెంట్‌లో కూర్చుని మాట్లాడుతున్న సమయంలో ఒక దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. కిర్క్ మెడ భాగంలో కాల్చినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.సంఘటన చోటుచేసుకున్న వెంటనే అక్కడ ఉన్న అధికారులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స పొందుతూ చివరికి ఆయన మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. తన సన్నిహితుడు మృతి చెందడం పట్ల అధ్యక్షుడు ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
వివరాలు
'టర్నింగ్ పాయింట్ యూఎస్‌ఏ' అనే యూత్ ఆర్గనైజేషన్ సీఈవోగా చార్లీ కిర్క్
చార్లీ కిర్క్ గొప్ప వ్యక్తి అని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్‌లో వెల్లడించారు. కిర్క్ మృతికి సంతాపంగా జాతీయ జెండాను అవనతం చేయాలని పిలుపునిచ్చారు. ట్రంప్ మాట్లాడుతూ, చార్లీ కిర్క్ యువత హృదయాలను అర్థం చేసుకోవడంలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్న వ్యక్తి అని తెలిపారు. చార్లీ కిర్క్ 'టర్నింగ్ పాయింట్ యూఎస్‌ఏ' అనే యూత్ ఆర్గనైజేషన్ సీఈవో, సహ వ్యవస్థాపకుడుగా పని చేస్తున్నారు. నిందితుడు తమ అదుపులోనే ఉన్నట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ పేర్కొన్నారు.
వివరాలు
యూనివర్సిటీకి కిర్క్ కార్యక్రమాన్ని రద్దు చేయాలని కోరుతూ 1000 మంది సంతకాలతో కూడిన ఓ ఫిర్యాదు
చార్లీ కిర్క్ 18 సంవత్సరాల వయసులోనే 'టర్నింగ్ పాయింట్ యూఎస్‌ఏ' సంస్థను స్థాపించి, అమెరికా యువత రాజకీయ చైతన్యానికి ప్రధాన పాత్ర వహించారు. కిర్క్ కార్యక్రమాన్నిరద్దు చేయాలని 1000 మంది విద్యార్థులు సంతకాలతో కూడిన ఓ ఫిర్యాదు పత్రం యూనివర్సిటీకి సమర్పించారు. అయితే యూనివర్సిటీ ప్రకటనలో స్వేచ్ఛాభిప్రాయానికి, గౌరవప్రద చర్చలకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
టెంట్‌లో కూర్చుని మాట్లాడుతున్నకిర్క్
Charlie Kirk, right-wing activist and key ally of US President Donald Trump, is shot dead during an event at Utah Valley University.
— TRT World (@trtworld) September 10, 2025
For more: https://t.co/FgU40bmJ0F pic.twitter.com/hSQpXwx7p6