తదుపరి వార్తా కథనం

Donald Trump: ట్రంప్ కీలక నిర్ణయం.. విదేశీ తయారీ కార్లపై 25% సుంకం
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 27, 2025
09:03 am
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
విదేశాల్లో తయారై అమెరికాలో దిగుమతయ్యే కార్లపై 25 శాతం సుంకం (Tariffs) విధిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ నిర్ణయం ఏప్రిల్ 2 నుంచి అమలులోకి వస్తుందని ఆయన స్పష్టంగా వెల్లడించారు.
బుధవారం వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. 'అమెరికాలో ఉత్పత్తి కాని అన్ని కార్లపై 25 శాతం సుంకం విధిస్తున్నాం.
ఈ చర్య శాశ్వతంగా అమలులో ఉంటుంది. అయితే,అమెరికాలోనే తయారైన కార్లకు ఎలాంటి సుంకం ఉండదు.
ఈ నిర్ణయం మా దేశ ఆర్థిక వృద్ధిని మరింత పెంచుతుంది. మునుపెన్నడూ చూడని స్థాయిలో అభివృద్ధిని కొనసాగించేందుకు తోడ్పడుతుంది.
ఏప్రిల్ 2 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయి' అని ట్రంప్ తెలిపారు.