Donald Trump : చైనాకు ట్రంప్ షాక్.. విదేశీ డ్రోన్లపై 100 శాతం టారిఫ్ విధింపు
ఈ వార్తాకథనం ఏంటి
డ్రోన్ల తయారీ, విక్రయాల రంగంలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విదేశాల నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే కొన్ని రకాల డ్రోన్లు, వాటి భాగాలపై ఏకంగా 100 శాతం వరకు టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ భద్రతను కాపాడటంతో పాటు దేశీయంగా డ్రోన్ల తయారీని ప్రోత్సహించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి.
వివరాలు
ఏ డ్రోన్లపై ఎంత పన్నంటే..
వైట్‌హౌస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 25 కేజీల కంటే ఎక్కువ బరువున్న అన్‌మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ (UAS) డ్రోన్లపై 100 శాతం టారిఫ్ వర్తించనుంది.
ముఖ్యంగా థర్మల్ ఇమేజర్లు, డాకింగ్ స్టేషన్లు వంటి జాతీయ భద్రతకు సంబంధించిన ప్రత్యేక సామర్థ్యాలు కలిగిన డ్రోన్లు ఈ పన్ను పరిధిలోకి వస్తాయి.
మరోవైపు చిన్న తరహా డ్రోన్ల దిగుమతులపై 25 శాతం సుంకం విధించనున్నారు. ఈ కొత్త టారిఫ్ నిబంధనలు సెప్టెంబర్ 3 నుంచి అమల్లోకి రానున్నాయి.
ప్రస్తుతం ప్రపంచ డ్రోన్ల మార్కెట్‌లో చైనాకు చెందిన DJI కంపెనీకి గణనీయమైన ఆధిపత్యం ఉంది.
వివరాలు
ఏ డ్రోన్లపై ఎంత పన్నంటే..
ప్రపంచ మార్కెట్‌లో దాదాపు మూడింట రెండు వంతుల వాటా DJIకే ఉన్నట్లు సమాచారం. విదేశీ డ్రోన్లపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు అమెరికాలోనే డ్రోన్ల తయారీ, సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ఈ నిర్ణయం లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు.
దేశీయ తయారీ సామర్థ్యాలను పెంచడం ద్వారా జాతీయ భద్రతకు సంబంధించిన అవసరాలను కూడా స్వదేశీ ఉత్పత్తులతో తీర్చుకునే దిశగా అమెరికా అడుగులు వేస్తోంది.