LOADING...
Trump: ట్రంప్‌పై స్నైపర్ దాడికి మరో కుట్ర..? 
ట్రంప్‌పై స్నైపర్ దాడికి మరో కుట్ర..?

Trump: ట్రంప్‌పై స్నైపర్ దాడికి మరో కుట్ర..? 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 20, 2025
09:57 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై గుర్తుతెలియని దుండగులు మరో కుట్ర పన్నినట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ వెల్లడించారు. పామ్‌బీచ్ విమానాశ్రయంలో అధ్యక్షుడి ఎయిర్‌ఫోర్స్ వన్ విమానానికి ఎదురుగా,స్నైపర్ దాడికి అనువైన ఏర్పాట్లు చేసినట్లు ట్రంప్ భద్రతాబృందం గుర్తించింది. దుండగులు ఒక చెట్టుకు నిచ్చెన ఏర్పాటు చేసి,వేటగాళ్లు అక్కడ నుండి ఎదురుచూస్తూ దాడి చేయగలిగే విధంగా గూడు నిర్మించినట్టు అధికారులు పేర్కొన్నారు. గూడులో ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకునే ఏర్పాట్లు ఉన్నందున,వెంటనే అధ్యక్షుడి భద్రతను మరింత కట్టుదిట్టంగా రూపొందించామని అధికారులు పేర్కొన్నారు. ఈఘటనపై ఎఫ్‌బీఐ దర్యాప్తు కొనసాగించిందని కూడా తెలిపారు.ఘటనా స్థలంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానితులు కనిపించకపోవడంతో,ఎఫ్‌బీఐ బృందం అధునాతనట్రాకింగ్ సాంకేతికతలను ఉపయోగించి దుండగులను పట్టేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విమానం వద్ద స్నైపర్‌ దాక్కునేలా ఏర్పాట్లు