Page Loader
Donald Trump: డిజిటల్‌ ట్యాక్స్‌పై భగ్గుమన్న ట్రంప్‌.. కెనడాతో వాణిజ్య చర్చలు రద్దు!
డిజిటల్‌ ట్యాక్స్‌పై భగ్గుమన్న ట్రంప్‌.. కెనడాతో వాణిజ్య చర్చలు రద్దు!

Donald Trump: డిజిటల్‌ ట్యాక్స్‌పై భగ్గుమన్న ట్రంప్‌.. కెనడాతో వాణిజ్య చర్చలు రద్దు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 28, 2025
12:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) కెనడా విధిస్తున్న డిజిటల్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ (Digital Services Tax - DST)పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా - కెనడా మధ్య ఉన్న అన్ని రకాల వాణిజ్య చర్చలను తక్షణమే నిలిపివేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటనను ఆయన తన స్వంత సోషల్ మీడియా వేదిక 'ట్రూత్‌'లో పోస్ట్ చేశారు. కెనడాతో వాణిజ్య చర్చలు ఇకపై ఉండవని స్పష్టం చేశారు. కెనడా ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్‌ సర్వీస్‌ పన్ను చట్టం ఇప్పటికే 2023లో అమలులోకి వచ్చినా, పన్ను చెల్లింపులు మాత్రం 2025 జూన్‌ 30 నుంచి ప్రారంభం కానున్నాయి.

Details

టెక్ దిగ్గజాలపై ప్రభావం

ఈ చట్టం ప్రకారం కెనడాలో ఆన్‌లైన్‌ ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం పొందే అంతర్జాతీయ డిజిటల్‌ సంస్థలు (ప్రధానంగా అమెరికా కంపెనీలు) తమ డిజిటల్ ఆదాయంపై 3 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ సేవలు, డిజిటల్ ప్రకటనల ఆదాయం, వినియోగదారుల డేటా అమ్మకాలు మొదలైనవి ఈ పన్ను పరిధిలోకి వస్తాయి. ఈ విధానం ప్రధానంగా అమెరికాకు చెందిన గూగుల్‌, అమెజాన్‌, మెటా, యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి టెక్‌ దిగ్గజాలపై ప్రభావం చూపనుంది.

Details

జూన్ 30న ఈ పన్ను విధానం

ఈ పరిణామాల నేపథ్యంలోనే ట్రంప్ ఈ చర్యకు దిగారు. కెనడా తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, వాణిజ్య సంబంధాల్లో మార్పులు తప్పవన్న సంకేతాలను ఆయన ఇప్పటికే ఇచ్చారు. తాజా ప్రకటనతో అమెరికా-కెనడా మధ్య వాణిజ్య సంబంధాలు మరింత దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై ట్రంప్ తీసుకున్న తీరును పలువురు విశ్లేషకులు గమనిస్తున్నారు. జూన్ 30 నుంచి ఈ పన్ను విధానం అధికారికంగా ప్రారంభం కావడం, అదే రోజు నుంచే ట్రంప్ ఆగ్రహావేశం తారాస్థాయికి చేరడం రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది.