Page Loader
Trump: టారిఫ్‌లపై చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ట్రంప్
టారిఫ్‌లపై చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ట్రంప్

Trump: టారిఫ్‌లపై చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ట్రంప్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 04, 2025
11:06 am

ఈ వార్తాకథనం ఏంటి

అంచనాలను మించిపోయేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై భారీ సుంకాలు విధిస్తూ వాణిజ్య యుద్ధానికి శంఖం పూరించారు. ఈ నిర్ణయంపై అనేక దేశాలు భిన్నభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ నిర్ణయం గ్లోబల్ ఎకానమీపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్న ఆందోళనల మధ్య, ఆయన తాజాగా కీలక ప్రకటన చేశారు. సుంకాల (Trump Tariffs)పై చర్చకు తాను సిద్ధమని సంకేతాలు ఇచ్చారు. ఇతర దేశాలు అమెరికా నుండి దిగుమతులపై విధిస్తున్న సుంకాలను బట్టి తాము కూడా చర్యలు తీసుకున్నాం. ఇది పూర్తిగా పరస్పర చర్య. ఇప్పుడు చాలా దేశాలు మా తీర్పును పరిగణనలోకి తీసుకుంటున్నాయి.

Details

కొన్ని దేశాల నుంచి ఆఫర్లు వస్తున్నాయి

ఇది మా విజయానికి నిదర్శనం. అమెరికా మళ్లీ ప్రాధాన్యత పొందుతుంది. ఇప్పుడు కొన్ని దేశాలు మాకు మంచి ఆఫర్లు ఇస్తామంటున్నాయి. అటువంటి దేశాలతో టారిఫ్‌ చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ట్రంప్ పాలనలోని ఇతర ప్రముఖుల అభిప్రాయాలకు విరుద్ధంగా ఉన్నాయి. వాణిజ్య మంత్రి హోవర్డ్‌ లుట్నిక్‌, ట్రంప్‌ సన్నిహితుడు పీటర్‌ నవరో లాంటి వారు సుంకాల విషయమై అమెరికా ప్రస్తుతం ఎలాంటి డీల్‌లను కుదుర్చుకునే అవకాశం లేదని ప్రకటించారు. అయితే ఇప్పుడే ట్రంప్ చర్చలకు ముందుకు రావడమే కీలక పరిణామంగా మారింది.

Details

దేశాలపై విధించిన సుంకాల వివరాలు

ట్రంప్ ప్రకటించిన విధంగా, అమెరికాకు దిగుమతయ్యే ప్రతి వస్తువు మీద కనీసం 10 శాతం నుంచి గరిష్ఠంగా 49 శాతం వరకు టారిఫ్‌లు అమలులోకి వచ్చాయి. భారత్‌పై 26 శాతం, చైనాపై 34 శాతం, యూరోపియన్ యూనియన్ దేశాలపై 20శాతం విధించింది. ఈ టారిఫ్‌లను రాయితీ సుంకాలుగా అభివర్ణించిన ట్రంప్, ఆయా దేశాలు తమపై విధిస్తున్న సుంకాలలో సగమే తాము విధిస్తున్నామని తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో గ్లోబల్ వాణిజ్య రంగం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ట్రంప్ ఇచ్చిన చర్చల సంకేతాలపై తదుపరి వ్యవహారాలు ఎలా మలుపు తిరుగుతాయో చూడాలి!