LOADING...
H-1B visa: హెచ్‌-1బీ వీసా దుర్వినియోగంపై ట్రంప్ ప్రభుత్వ కఠిన చర్యలు.. ప్రాజెక్ట్‌ ఫైర్‌వాల్‌ కింద 175 కేసులు
హెచ్‌-1బీ వీసా దుర్వినియోగంపై ట్రంప్ ప్రభుత్వ కఠిన చర్యలు.. ప్రాజెక్ట్‌ ఫైర్‌వాల్‌ కింద 175 కేసులు

H-1B visa: హెచ్‌-1బీ వీసా దుర్వినియోగంపై ట్రంప్ ప్రభుత్వ కఠిన చర్యలు.. ప్రాజెక్ట్‌ ఫైర్‌వాల్‌ కింద 175 కేసులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 08, 2025
11:58 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో హెచ్‌-1బీ వీసా దుర్వినియోగంపై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. విదేశీ కార్మికులను ఉపయోగించి దేశీయ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికా కార్మిక శాఖ దర్యాప్తు చేపట్టింది. ఈ దిశగా సెప్టెంబర్‌లో 'ప్రాజెక్ట్ ఫైర్‌వాల్‌' (Project Firewall) పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా, హెచ్‌-1బీ వీసా దరఖాస్తులు, ఆమోదాలు, ఉద్యోగ భర్తీ విధానాలు తదితర అంశాలపై సమగ్రంగా పరిశీలన ప్రారంభించిన కార్మిక శాఖ ఇప్పటివరకు 175 కేసులు నమోదు చేసినట్లు అమెరికా మీడియా సంస్థలు నివేదించాయి.

Details

స్థానిక ఉద్యోగావకాశాలను కాపాడటమే లక్ష్యం

ప్రాజెక్ట్ ఫైర్‌వాల్‌ లక్ష్యం ఏమిటంటే.. వీసా వ్యవస్థను దుర్వినియోగం చేసే సంస్థలను గుర్తించి, స్థానిక ఉద్యోగ అవకాశాలను కాపాడడం. ఈ చర్యలతో వీసా ప్రక్రియలో పారదర్శకత పెరగడంతో పాటు, దేశీయ కార్మికుల హక్కులు రక్షించబడతాయని అమెరికా ప్రభుత్వం తెలిపింది.