LOADING...
Donald Trump: త్వరలోనే భారత్ వస్తా మోదీని కలుస్తా: ట్రంప్
త్వరలోనే భారత్ వస్తా మోదీని కలుస్తా: ట్రంప్

Donald Trump: త్వరలోనే భారత్ వస్తా మోదీని కలుస్తా: ట్రంప్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 07, 2025
08:08 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాదిలో తాను భారత్‌ వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పై ప్రశంసలు కురిపించారు. ఓవల్‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్‌ .."భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక గొప్ప నాయకుడు. ఆయనతో నాకు మంచి స్నేహబంధం ఉంది. భారత్‌-అమెరికా వాణిజ్య సంబంధాలను మరింత బలపరచడం మా ఇద్దరి ప్రధాన లక్ష్యం. ఈ దిశగా జరుగు చర్చలు సానుకూలంగా కొనసాగుతున్నాయి. రష్యా నుంచి చమురు దిగుమతులను మోదీ ప్రభుత్వం క్రమంగా తగ్గిస్తోంది. ఇంధన కొనుగోలు విషయంలో వాషింగ్టన్‌-న్యూఢిల్లీ మద్య అనుసంధానం పెరుగుతోంది.

వివరాలు 

వాణిజ్య పరంగా అభివృద్ధి… 

రష్యా ఇంధనాన్ని కొనుగోలు చేసే దేశాలపై అమలు చేస్తున్న చర్యల నేపథ్యంలో భారత్‌ కూడా రష్యా చమురు కొనుగోళ్లను పెద్దఎత్తున నిలిపివేసింది. నేను వచ్చే ఏడాది భారత్‌ పర్యటనకు వస్తాను. మోదీతో భేటీ అవుతాను" అని తెలిపారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు సాగుతున్న సందర్భంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల,రష్యా ముడిచమురు దిగుమతులు కొనసాగుతున్నాయన్న ఆందోళనతో అమెరికా,భారత దిగుమతులపై అదనపు సుంకాలను విధించిన విషయం తెలిసిందే. ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టం కావాలన్న తపనతోనే ట్రంప్‌ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని వైట్ హౌస్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ ముందు కూడా స్పష్టం చేశారు. ఆమె మాట్లాడుతూ,భారత్‌ అమెరికాకు అత్యంత కీలక భాగస్వామి అని పేర్కొన్నారు.