LOADING...
Trump: ఇరాన్ తర్వాత క్యూబా టార్గెట్.. ట్రంప్ తాజా హెచ్చరికలతో ప్రపంచంలో టెన్షన్
ఇరాన్ తర్వాత క్యూబా టార్గెట్.. ట్రంప్ తాజా హెచ్చరికలతో ప్రపంచంలో టెన్షన్

Trump: ఇరాన్ తర్వాత క్యూబా టార్గెట్.. ట్రంప్ తాజా హెచ్చరికలతో ప్రపంచంలో టెన్షన్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 06, 2026
10:52 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి. ఒకవైపు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతుండగా,మరోవైపు పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధ వాతావరణాన్ని మరింత పెంచుతున్నాయి. ఈ పరిణామాల మధ్య ప్రపంచం మొత్తం ఆందోళనలో ఉంది. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం ముగిసిన తర్వాత క్యూబా విషయంలో నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ వెల్లడించారు. దీంతో మరో యుద్ధం జరుగే అవకాశాలు ఉన్నాయని ఆయన పరోక్షంగా సూచించినట్లైంది.

వివరాలు 

యుద్ధం ముగిసిన వెంటనే క్యూబా అంశాన్ని పరిష్కరిస్తాం: ట్రంప్

తాజాగా వైట్‌హౌస్‌లో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రస్తుతం ఇరాన్‌పై యుద్ధం కొనసాగుతోందని పేర్కొన్నారు. ఆ యుద్ధం ముగిసిన వెంటనే క్యూబా అంశాన్ని పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. అమెరికాతో ఒప్పందం చేసుకోవడానికి క్యూబా ఆసక్తి చూపుతోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే క్యూబా అమెరికా మాట వినకపోతే పరిస్థితులు కఠినంగా మారుతాయని హెచ్చరించారు. చివరికి స్నేహపూర్వక మార్గంలోనే క్యూబాను తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశం కూడా ఉందని ఆయన చెప్పారు. ఇక ఇరాన్ యుద్ధం ముగిసిన తర్వాత ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

వివరాలు 

క్యూబాకు చమురు విక్రయించే ఏ దేశమైనా.. అమెరికా నుంచి టారిఫ్‌లను ఎదుర్కోవాలి 

ఇదే కాకుండా, క్యూబాను లక్ష్యంగా చేసుకుని డొనాల్డ్‌ ట్రంప్‌ గతంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. క్యూబాకు చమురు విక్రయించే ఏ దేశమైనా అమెరికా నుంచి టారిఫ్‌లను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై కూడా ట్రంప్ సంతకం చేశారు. క్యూబా విషయంలో జాతీయ అత్యవసర పరిస్థితి కింద ఆయన ఆదేశాలు జారీ చేశారు. క్యూబా ప్రభుత్వం అమెరికా జాతీయ భద్రతకు, అలాగే విదేశాంగ విధానానికి తీవ్రమైన ముప్పుగా మారిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇదే సమయంలో అవసరమైతే స్నేహపూర్వక విధానంలోనే క్యూబాను తమ నియంత్రణలోకి తీసుకునే పరిస్థితి రావచ్చని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇరాన్ తర్వాత క్యూబా టార్గెట్ అంటూ ట్రంప్ సంచలన ప్రకటన

Advertisement