
Trump Tariffs: జనావాసాలు లేని దీవులపై ట్రంప్ సుంకాలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం పలు దేశాలపై పరస్పర సుంకాలు విధించిన విషయం తెలిసిందే.
ఈ పరిణామాల నేపథ్యంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆయన జనసంచారం లేని అంటార్కిటికా దీవులపైనా టారిఫ్‌లు (Tariffs) విధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆస్ట్రేలియన్ దీవులపై 10% సుంకాలు
ఆస్ట్రేలియానియంత్రణలో ఉన్న హియర్డ్ (Heard), మెక్‌డొనాల్డ్ (McDonald) దీవులపై ట్రంప్ 10 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ నిర్ణయంపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ (Anthony Albanese)తీవ్రంగా స్పందించారు.
భూమిపై ఎక్కడా ట్రంప్ టారిఫ్‌ల నుంచి రక్షణ లేదని వ్యాఖ్యానించిన ఆయన,ఇది స్నేహపూర్వక చర్య కాదని తెలిపారు.
అయితే,తమ దేశం మాత్రం అమెరికా దిగుమతులపై ప్రతిస్పందనగా సుంకాలు విధించదని స్పష్టం చేశారు.
వివరాలు
ఆస్ట్రేలియా ఆధీనంలో దీవులు
వైట్‌హౌస్ అధికారుల ప్రకారం, ఈ దీవులు ఆస్ట్రేలియా ఆధీనంలో ఉన్న భూభాగంగా పరిగణించబడటమే ఈ నిర్ణయానికి కారణమని తెలిపారు.
ఆసక్తికరంగా, హియర్డ్,మెక్‌డొనాల్డ్ దీవులకు ఆస్ట్రేలియా ప్రధాన భూభాగం నుంచి ప్రయాణించేందుకు రెండు వారాల సమయం పడుతుంది.
ఇవి అగ్నిపర్వతాల క్రియాశీలక ప్రాంతాలు కాగా, ప్రధానంగా సీల్స్, పెంగ్విన్‌లు, ఇతర పక్షులకు మాత్రమే ఆశ్రయం కల్పిస్తాయి.
శాశ్వత నివాసానికి అనుకూలమైన ప్రదేశం కాదు.
వివరాలు
ఆర్కిటిక్ దీవులపైనా ట్రంప్ సుంకం
ఇదిలా ఉండగా, ఆర్కిటిక్ మహాసముద్రంలోని అగ్నిపర్వత ద్వీపం జాన్ మాయెన్ (Jan Mayen) పై కూడా ట్రంప్ 10% సుంకం విధించారు.
ఈ ద్వీపం నార్వేలోని ట్రోమ్సోకు (Tromsø) ఉత్తరంగా 580 మైళ్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రధానంగా ధ్రువపు ఎలుగుబంట్లు ఉంటాయి, పర్యాటకులకు మాత్రమే పరిమితమైన ప్రదేశంగా ఉంది.
అదనంగా, ట్రంప్ నార్వే నుంచి దిగుమతులపై 15% సుంకం విధించారు.
ఈ చర్యలు అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రస్తుత రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.